ఆర్‌.ఆర్‌.ఆర్… నిమిషానికి ప‌ది కోట్లా?

ఒక నిమిషం పాటు సాగే స‌న్నివేశానికి రూ: 10 కోట్లు ఖ‌ర్చు. – ఈ లెక్క వింటుంటేనే దిమ్మ తిరిగిపోతోంది క‌దూ. 10 కోట్ల‌తో తెలుగులో ఓ మీడియం బ‌డ్జెట్ సినిమానే పూర్త‌యిపోతుంది. అలాంటిది ఒక నిమిషానికే అంత ఖర్చు పెడుతున్నారంటే ఇక ఆ సినిమా స్థాయి ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోండి. ఇదంతా `ఆర్‌.ఆర్‌.ఆర్‌` సినిమాకి సంబంధించిన ముచ్చ‌టే. రాజ‌మౌళి `బాహుబ‌లి` త‌ర్వాత చేస్తున్న సినిమా ఇది. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్నారు.

భారీ అంచ‌నాల‌తో రూపొందుతున్న ఈ సినిమా కోసం దాదాపు 350 కోట్లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్టుస‌మాచారం. ఇప్ప‌టికే 70 శాతం సినిమా పూర్త‌యింది. ఇక మిగిలిన 30 శాతం పూర్తిచేస్తే స‌రిపోతుంది. ఈ ద‌శ‌లోనే ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌టికొచ్చింది. క్లైమాక్స్‌కి సంబంధించిన విష‌య‌మ‌ది. 15 నిమిషాల‌పాటు సాగే ఈ సినిమా క్లైమాక్స్ కోసం ఏకంగా రూ:150 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ట‌. అంటే ఒకొక్క నిమిషానికి రూ: 10 కోట్లన్న‌మాట‌. సినిమాకి క్లైమాక్స్ స‌న్నివేశాలే హైలెట్‌గా నిల‌వ‌బోతున్నాయ‌ట. అందుకే ఈ స‌న్నివేశాల్ని ఒక రేంజ్‌లో తీయాల‌నుకుంటున్నాడ‌ట రాజ‌మౌళి. ఇప్ప‌టికే ఏర్పాట్ల‌న్నీ పూర్త‌య్యాయ‌ట‌. త్వ‌ర‌లోనే ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్‌ల‌పై ఆస‌న్నివేశాల్ని తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు తెలిసింది.