బికినీలో ర‌జినీ హీరోయిన్..

Last Updated on by

అమ్మో.. ఇంత‌లోనే ఎంత మార్పు..? మొన్నటికి మొన్న కాలాలో ఎంత ప‌ద్ద‌తిగా చీర‌క‌ట్టుకుని క‌నిపించింది. అంత‌లోనే ఇలా బికినీ వేసిందేంటి..? ఇప్పుడు హ్యూమాఖురేషీని చూసి ఇదే అనుకుంటున్నారంతా. బాలీవుడ్ నుంచి వ‌చ్చిన ఈ భామ‌.. కాలాలో ర‌జినీతో జోడీ క‌ట్టింది. ప్రియురాలి పాత్ర‌లో బాగానే ఒదిగిపోయింది. కాలా ఫ్లాప్ కావ‌డంతో మ‌ళ్లీ సౌత్ నుంచి ఈ ముద్దుగుమ్మ‌కు పెద్ద‌గా ఆఫ‌ర్లు అయితే వ‌చ్చిన‌ట్లు క‌నిపించ‌డం లేదు. కానీ ఇప్ప‌టికే సైరాలో ఓ పాత్ర కోసం హ్యూమాను తీసుకున్నారు.. ఇక వెంక‌టేశ్-బాబీ సినిమాలోనూ ఈమె హీరోయిన్ గా న‌టించ‌బోతుంద‌నే టాక్ న‌డుస్తుంది.

బాలీవుడ్ లో కూడా త‌న ఉనికి కోసం బాగానే క‌ష్ట‌ప‌డుతుంది హ్యూమా. ఈ మ‌ధ్యే బికినీ ఫోటోషూట్ తో అంద‌రి మ‌తులు ఒక్క‌సారే చెడ‌గొట్టేసింది ఈ ముద్దుగుమ్మ‌. అవ‌కాశాల కోసం ఇలా అందాలు ఆర‌బోయక త‌ప్ప‌డం లేదు పాపం ఈ భామ‌కు. 30 ఏళ్ల‌కే ముదురు హీరోయిన్ మాదిరి క‌నిపిస్తుండ‌టంతో కుర్ర హీరోలు హ్యూమాను అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. మ‌రి ఈ బికినీలు చూసిన త‌ర్వాతైనా ఈమె ఇంకా కుర్ర హీరోయిన్ అని న‌మ్ముతారో లేదో..!

User Comments