హుషారు లైవ్ అప్‌డేట్స్

Last Updated on by

ప్ర‌థ‌మార్థం చ‌క‌చ‌కా సాగుతుంది. యూత్‌ఫుల్ గా అల‌రిస్తుంది. అయితే ద్వితీయార్థం నెమ్మ‌దిగా సాగ‌డం కొంత‌ మైన‌స్. అయితే క‌డుపుబ్బా న‌వ్వించే కామెడీ పెద్ద ప్ల‌స్. న‌టీన‌టులంతా ఎంతో స‌హ‌జంగా ఒదిగిపోయి న‌టించారు. కామెడీ టైమింగ్ ఫెంటాస్టిక్. పాట‌లు బావున్నాయి. యూత్‌కి పిచ్చిగా న‌చ్చేస్తుంది. ఫ్యామిలీ ఆడియెన్‌కి కొన్ని ఎబ్బెట్టు సీన్లు న‌చ్చ‌క‌పోవ‌చ్చు. చూద్దాం.. ఫ్యామిలీ ఆడియెన్ ఎలా రిసీవ్ చేసుకుంటారో..

లైవ్ రివ్యూ: 3.0/ 5.0

8.00 AM: క‌్లైమాక్స్ కి వేళాయె.. కుర్రాళ్ల స‌క్సెస్‌కి దారి చూపించిన ద‌ర్శ‌క దైవం… హ్యాపీ ఎండింగ్..

7.55 AM: ధృవ్‌, బంటీ, ఆర్య మొత్తానికి దారిలోకొచ్చారు. ఇప్పుడు చ‌ట్ట‌బ‌ద్ధంగా బీర్ ప్లాంట్ ఓపెన్ చేస్తున్నారు. అందుకోసం బ్యాంక్‌లోన్‌కి ప్ర‌య‌త్నిస్తున్నారు. బ్యాంక్ వాళ్లు ఎలాగూ లోన్ ఇవ్వ‌రు కాబ‌ట్టి ఫైనాన్షియ‌ర్ల ద‌గ్గ‌ర అప్పు తెచ్చారు. చివ‌రి సాంగ్‌కి వేళాయెనే..

7.50 AM: అయితే రాజ్ బొల్ల‌మ్ కామెడీ తో గ్రాఫ్ పైపైకి.. బాస్‌తో ఫోన్ సంభాష‌ణ‌.. ఉద్యోగానికి రాజీనామా.. హిలేరియ‌స్ కామెడీ..

సినిమా సాగుతోంది.. బోరింగ్ ఫేజ్..

7.45 AM: రాజ్ బొల్ల‌మ్ ఫ్లాష్ బ్యాక్ క‌థ ఆ ముగ్గురికి చెప్పాడు.. జింద‌గీ పిష‌ప్ సాంగ్ లో అత‌డి సాఫ్ట్ వేర్ నేప‌థ్యం.. లైఫ్ గురించి రివీలైంది..

7.40 AM: రాజ్ బొల్ల‌మ్ (రాహుల్ రామ‌కృష్ణ) ఎంట్రీ.. ధృవ్‌, బంటీ, ఆర్య ఉన్న జైలు సెల్‌లోనే వీడి ఎంట్రీ..

7.35 AM: చై ట్రీట్‌మెంట్‌కి 30ల‌క్ష‌లు రెడీ.. ఇక్క‌డో స‌డెన్ ట్విస్టు.. చై ఆప‌రేష‌న్ ఒక‌రోజు ముందు బీర్ ఫ్యాక్ట‌రీపై పోలీస్ రైడ్‌.. ఫ్యాక్ట‌రీ సీజ్ చేసి డ‌బ్బు గుంజుకుని ధృవ్‌, బంటీ, ఆర్య‌ అరెస్ట్..

7.30 AM: బీర్ ట్ర‌య‌ల్‌ స‌క్సెస్.. వేస్కో బీర్ సాంగ్.. చెడినోళ్లంతా చెడ్డోళ్లు కాదు.. ఆక‌తాయిలూ స‌క్సెస‌వుతారు..

7.25 AM: మొత్తానికి బీర్ క‌నిపెట్టారు.. బిజినెస్ కోసం యాడ్లు కూడా ఇచ్చేశారు…

7.20 AM: తొలి ట్ర‌య‌ల్ ఫెయిల్‌.. అందులో ఒక‌డు ఇంకా ఏదో క‌నిపెట్టాల‌ని తాప‌త్ర‌యం.. రీఇన్వెన్ష‌న్‌..

7.15 AM: ధృవ్‌, బంటీ, ఆర్య ఇలా అయితే లాభం లేద‌నుకుని సొంతంగానే బీర్ త‌యారు చేయాల‌నుకుంటారు. బీర్ త‌యారు చేయ‌డమెలా ట్ర‌య‌ల్స్..

7.10 AM: ధృవ్‌, బంటీ, ఆర్య మెంట‌ల్ టెన్ష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు బీర్ తాగేందుకు వెళ్లారు. అనుకోకుండా పోలీసాయ‌న దెబ్బ‌కు బీర్ బాటిల్ ప‌గిలింది..

7:05 AM: ధృవ్‌ ల‌వ్ కూడా ఫెయిల్.. ఫ్యామిలీ, ఆర్థిక ఇబ్బందుల వ‌ల్ల‌ బ్రేక‌ప్‌

7.00 AM: ఎవ‌రి కుటుంబంలో వాళ్ల‌కు ఈతిబాధ‌లు, ఆర్థిక ఇబ్బందులు.. అయినా 30ల‌క్ష‌లు తేవాలి ట్రీట్‌మెంట్ కోసం..

6:50 AM : ద‌్వితీయార్థం మొద‌లు.. చై ట్రీట్‌మెంట్‌కి రూ.30ల‌క్ష‌లు కావాలి. ధృవ్‌, బంటీ, ఆర్య డ‌బ్బుకోసం తిప్ప‌లు..

*ప్ర‌థ‌మార్థం యూత్‌ఫుల్ .. బావుంది. ఘాటైన స‌న్నివేశాల‌కు ఫ్యామిలీ ఆడియెన్‌కి ఇబ్బందే. యూత్‌కు మాత్రం కిక్కే కిక్కు. ఇప్ప‌టివ‌ర‌కూ ఓకే.. ఇక‌పై ట‌ర్నులు, ట్విస్టులు ఎలా ఉండ‌బోతున్నాయో చూడాలి..

6:50 AM :బ్రేక‌ప్.. వాడిని వ‌దిలి అమెరికా వెళ్లిపోయింది.. డిప్రెష‌న్‌లో చై..

6:45 AM : అమెరికా వెళ్లిపోదాం రారా అంటూ లాక్కెళుతోంది గాళ్‌ఫ్రెండ్‌.. కానీ చైకి అది ఇష్టం లేదు. ఇద్ద‌రి మ‌ధ్యా ఘ‌ర్ష‌ణ‌..

6:35 AM :ఉండిపోమాకే 3వ పాట‌.. బాహుబలి సీన్స్ తీసిన‌ కేర‌ళ వాట‌ర్ ఫాల్స్ వ‌ద్ద తెర‌కెక్కించారు..

6:30 AM :అంద‌రూ గాళ్‌ఫ్రెండ్స్ బాగా క్లోజైపోతున్నారు.

6:25 AM :చివ‌రికి ఏదోలా గాళ్‌ఫ్రెండ్స్‌ని ప‌ట్టేశారు ఆ న‌లుగురు కొంటె కుర్ర‌గాళ్లు.. ఒక్క బంటి త‌ప్ప అంద‌రికీ దొరికారు.. బోయ్స్ అంతా క‌లిసి డే ఔటింగ్ కి వెళ్లారు.. క‌దిలే మేఘ‌మే.. పాట‌..

6:20 AM :మిగ‌తా ముగ్గురూ చెడిన వాల్లు గాళ్‌ఫ్రెండ్ కోసం సెర్చింగ్.. ధృవ్‌ ల‌క్ చెక్ చేసుకున్నాడు.. గాళ్‌ఫ్రెండ్ సెర్చ్ క్ర‌మంలో బంటీ, ఇత‌రుల మ‌ధ్య హిలేరియ‌స్ కామెడీ పండింది..

6:15 AM : స‌డెన్‌గా ఫ‌స్ట్ క్ర‌ష్ అయిన గాళ్‌ఫ్రెండ్ ని చే క‌లుస్తాడు..

6:10 AM :  చే& రియా ద‌గ్గ‌రైపోయారు.

6:00 AM : ఆ న‌లుగురు గాలిగాళ్లు అని ద‌ర్శ‌కుడు చూపించాడు.. ప‌బ్బు, క్ల‌బ్బు, పార్టీ, తాగ‌డం, డ్రంక్‌& డ్రైవ్ కేసులు..

5:50 AM :టైటిల్స్ రోలింగ్.. ఆ న‌లుగురు బోయ్స్ కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ తొలి బీర్ కొట్టారు.. పాట రికార్డింగ్‌కి వెళ‌తారు..సాంగ్ మొద‌లైంది.. జ‌స్ట్ ఓకే..

5:45 AM :స్కూల్ పూర్త‌య్యాక కాలేజ్ లో చేరిన స్నేహితులు.. హాస్ట‌ల్ వార్డెన్ రాజు ప‌రిచ‌యం..

5:40 AM :చై బాల్యంలోని తీపి గుర్తులు.. ధృవ్‌, బంటీ, ఆర్య‌, చై న‌లుగురు స్నేహితులు..

5:30 AM : చై పాత్ర‌తో సినిమా మొద‌లైంది. అత‌డికి ఆస్ప‌త్రిలో స‌ర్జ‌రీ జ‌రుగుతోంది.

ప‌రిమిత బ‌డ్జెట్‌తో తెర‌కెక్కి ఇటీవ‌ల ఆస‌క్తి పెంచిన సినిమా హుషారు. శ్రీ‌హ‌ర్ష ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ల‌క్కీ మీడియా ప‌తాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మించారు. అర్జున్ రెడ్డి ఫేం రాహుల్ రామ‌కృష్ణ‌న్, పెళ్లి చూపులు ప్రియ‌ద‌ర్శి, తేజస్ కంచెర్ల‌, తేజ్ కూర‌పాటి, అభిన‌వ్, దినేష్ తేజ్, ద‌క్ష‌, ప్రియ వ‌డ్ల‌మాని, హేమ ఇంగ్లే ప్ర‌ధాన తారాగ‌ణం.

స్టార్ ప‌వ‌ర్ లేకుండానే వ‌స్తున్న ఈ సినిమా పోస్ట‌ర్లు, టీజ‌ర్ ద‌శ‌నుంచే ఆస‌క్తి పెంచింది. బీర్ నేప‌థ్యంలో అల్ల‌రి చిల్ల‌ర‌గా తిరిగే ఆక‌తాయిల క‌థేంలో, స్నేహం విలువేంటో తెర‌పై చూడండి అంటూ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్ర‌చారం చేశారు. దాంతో ఈ సినిమాపై యువ‌త‌రంలో ఆస‌క్తి పెరిగింది. అస‌లు హుషారులో అంత హుషారేం ఉందో తెలియాలంటే స‌మీక్ష‌లోకి వెళ్లాల్సిందే.

User Comments