శ్ర‌ద్ధాకు రెండో ఇల్లు సెట్ చేసిన హీరో

`సాహో` లాంటి భారీ ప్రాజెక్టుతో టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది శ్ర‌ద్ధా క‌పూర్. ప్ర‌భాస్‌కి శ్ర‌ద్ధా అంద‌చందాలు, ఫ్యాన్ ఫాలోయింగ్ ప్ల‌స్ కానుంది. సాహో హిందీ బిజినెస్‌కి ఇది పెద్ద రేంజులో క‌లిసొచ్చింది. ఇక‌పోతే శ్ర‌ద్ధాకి బాహుబ‌లి హీరో వ‌ల్ల చాలానే లాభాలున్నాయి. అదంతా అటుంచితే పెద్దింట ల‌గ్జ‌రీలో ఎంతో సుకుమారంగా పెరిగిన శ్ర‌ద్ధా క‌పూర్ హైద‌రాబాద్ వ‌స్తే ఎక్క‌డ ఉంటోంది? త‌న‌కి అతిధి మ‌ర్యాద‌లు చేసేదెవ‌రు? అంటే .. ఇంకెవ‌రు.. మ‌న డార్లింగేన‌ట‌! ప్ర‌భాస్ అస్స‌లు త‌న హీరోయిన్ల‌ను వ‌దిలి ఉండ‌లేడ‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. సౌత్‌లో ప్ర‌ముఖ క‌థానాయిక‌లంతా డార్లింగ్ ప్ర‌భాస్ అంటే ప‌డిచ‌చ్చేది ఇందుకే. అత‌డితో ఓసారి ప‌రిచ‌యం అయితే అస్స‌లు వ‌దిలి ఉండ‌లేరు.

ఇప్పుడు శ్ర‌ద్ధా ప‌రిస్థితి ఇంచుమించు అలానే ఉందిట‌. అస‌లు ముంబైనే మ‌ర్చిపోయేంత‌గా మ‌న డార్లింగ్ ఇస్తున్న హాస్పిటాలిటీతో ఏకంగా హైద‌రాబాద్‌ని ఈ అమ్మ‌డు రెండో ఇల్లుగా మార్చేసుకుందిట‌. ముంబై నుంచి ఇక్క‌డికి రాగానే ప్ర‌భాస్ ఇంటి నుంచి రిసీవింగ్‌కి ఖ‌రీదైన ప‌డ‌వ‌లాంటి కార్ విమానాశ్ర‌యానికి వెళుతుంది. అక్క‌డ శ్ర‌ద్ధాని రిసీవ్ చేసుకున్న త‌ర్వాత త‌న‌కో ఖ‌రీదైన భ‌వంతిలో ఏర్పాట్లు ఉంటాయి. అదంతా స‌రే.. శ్ర‌ద్ధా ఏం తింటుంది? ఈ ప్ర‌శ్న డార్లింగ్‌నే అడిగితే బాగా చెబుతాడ‌మో!! ప్ర‌భాస్ వీలున్న‌ప్పుడ‌ల్లా శ్ర‌ద్ధాకి స్పెష‌ల్ వంట‌కాలు తినిపిస్తున్నాడ‌ట‌. అనునిత్యం 18 ర‌కాల వంట‌కాలు ఈ అమ్మ‌డికి రుచి చూపిస్తున్నాడ‌ట‌. ఒక్కోసారి సుజీత్ & యువి టీమ్ ఈ జోడీతో ఉండొచ్చు. ఒక‌వేళ ఎవ‌రూ లేక‌పోయినా ప్ర‌భాస్ స్వ‌యంగా శ్ర‌ద్ధ‌ను శ్ర‌ద్ధ‌గా చూసుకుంటాడ‌ట‌. మొత్తానికి రెండో ఇల్లు ఫిక్స్ చేసుకుంది శ్రద్ధ‌. ఈ పుణ్యం ప్ర‌భాస్ డార్లింగ్‌దేన‌న్న‌ది వేడెక్కించే టాపిక్‌.