బ‌న్నీకి హైప‌ర్ ఆది డైలాగులు

బ‌న్నీ-త్రివిక్ర‌మ్ కాబినేష‌న్ లో అల వైకుంఠ‌పుర‌ములో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. మాట‌ల మాంత్రికుడు శైలి సినిమా అని టైటిల్ ను బ‌ట్టే తెలుస్తోంది. ఇప్ప‌టికే కొంత భాగం షూటింగ్ పూర్త‌యింది. ఇక త్రివిక్ర‌మ్ డైలాగులు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న సినిమా అంటే స‌ర్వం అంత‌నే. రైట‌ర్ల బృందం ఉన్నా కేవ‌లం ఆయ‌న చెప్పింది చేయ‌డానికి త‌ప్ప! వాళ్ల స‌ల‌హాలను తీసుకోడు. సినిమా అంతా త్రివిక్ర‌మ్ డైలాగ్ లే ఉండాలి. టైటిల్స్ కార్డులో ఆయ‌న పేరు క‌నిపించాలి. అయితే అల వైకుంఠ‌పురములో మాత్రం త్రివిక్ర‌మ్ , హైప‌ర్ ఆదిని స‌హాయ రైట‌ర్ గా నిమ‌యించిన విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఇందులో కొన్ని కామెడీ ట్రాక్స్ కు ఆదితోనే డైలాగులు రాయించాడుట‌. హీరో-క‌మెడీయ‌న్ల మ‌ధ్య ఆడైలాగు ఉంటాయ‌ని స‌మాచారం. ఇది షాకింగ్ విష‌య‌మే. ఇప్ప‌టివ‌ర‌కూ త్రివిక్ర‌మ్ ఏ రైట‌ర్ స‌హాయం తీసుకోలేదు. కామెడీ ట్రాక్స్ ను రాయ‌డం ఆయ‌న‌కు కొట్టిన పిండి. కానీ త‌ను అనుకున్న కామెడీ డైలాగుల‌ను ఆదినే రాయ‌గ‌ల‌డ‌ని న‌మ్మి అవ‌కాశం ఇచ్చినట్లు చెబుతున్నారు. హైప‌ర్ ఆది డుబులు మీనింగ్ డైలాగులు రాయ‌డం లో దిట్ట‌. జ‌బ‌ర్ద‌స్త్ లో త‌న స్ర్కిప్ట్ కు తానే డిజైన్ చేసుకుని డైలాగులు రాసుకుంటాడు. ఆ విధంగా ఆది బాగా ఫేమస్ అయిన సంగ‌తి తెలిసిందే.