నేను గొర్రెను కాదు..నా ద‌మ్మెంటో తెలుసు!

Last Updated on by

క‌న్నడ హీరో య‌శ్ ను చంపాల‌ని కుట్ర పన్నుతున్న‌ట్లు ఒక్క‌సారిగా సోష‌ల్  మీడియాలో వార్తలొచ్చిన సంగ‌తి తెలిసిందే. య‌శ్ ఎదుగుద‌ల‌ను ఓర్వ‌లేని పేరు మోసిన వ్య‌క్తి ఓ  గ్యాంగ్ కు సుపారి ఇచ్చిన‌ట్లు వార్తలొచ్చాయి. దీంతో క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌తో పాటు టాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది. కేజీయ‌ఫ్ తో ఇక్క‌డా పెద్ద స్టార్ అయినా…. అత‌నికి శ‌త్రువులు ఎవ‌రుంటారంటూ! పెద్ద ఎత్తున చ‌ర్చ సాగింది. తాజాగా ఈ క‌థ‌నాల‌పై య‌శ్ స్పందించాడు. న‌న్నెవ్వ‌రూ చంపాల‌నుకోలేదు. బెంగుళూరు ఏసీపీతో కూడా మాట్లాడా. నా పై ఎలాంటి కుట్ర జ‌ర‌గ‌లేదు. అవ‌న్నీ ఫేక్ వార్త‌లు. వాటిని న‌మ్ముద్దు. ఇలాంటి వాటిని సోష‌ల్ మీడియాలో స్ప్రెడ్ చేయోద్దు.

నా కుటుంబం ఎంతో బాధ‌ప‌డుతోంది. క్ష‌ణం గ్యాప్ లేకుండా ఫోన్ మ్రోగుతూనే ఉంది. ఇలాంటి వార్త‌ల వ‌ల్ల ఎలాంటి సంఘ‌ట‌న‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని భ‌యం త‌ప్ప! నేనెవ్వ‌రికి భ‌య‌ప‌డే వాడిని కాదు. పోలీసుల‌కు ఏ గ్యాంగ్ చిక్కినా నా గురించి మాట్లాడుకుంటున్నారు.  నేను గొర్రెను కాదు. ఎవ‌డు ప‌డితే వాడు వ‌చ్చి న‌రికేయ‌డానికి. వ‌చ్చిన ఊరుకునే టైప్ కాదు. నా సామ‌ర్య్దం ఏంటో నాకు తెలుసు. ఇలాంటి వార్త‌లు మీడియా ఎలా సృష్టిస్తుందో అర్ధం కాలేదంటూ సీరియ‌స్ అయ్యాడు. ఇలాంటి క‌థ‌నాలు ప‌రిశ్ర‌మ‌పై చెడు ప్ర‌భావాన్ని చూపిస్తాయ‌ని ఆగ్ర‌హం చెందాడు.

User Comments