అర్జున్ రెడ్డిలాంటోడే కావాలి!

Last Updated on by

Last updated on March 18th, 2019 at 04:52 pm

`అర్జున్ రెడ్డి` హిట్ తో టాలీవుడ్ కు ఉవెత్తున దూసుకొచ్చింది షాలిని పాండే. ఒక్క హిట్ ఆమె జీవితాన్నే మార్చేసింది. ఏ క‌థానాయిక‌కు రానంత గుర్తింపు తొలి సినిమాతేనే ద‌క్కించుకుంది. యువ‌త‌లో ప్రీతి శెట్టిగా నాటుకుపోయింది. ఆ వెంట‌నే `మ‌హాన‌టి` రూపంలో మ‌రో భారీ స‌క్సెస్. ఇంకే ముందు రెండు సినిమాల‌తో సౌత్ లో బాగా పాపుల‌ర్ అయిపోయింది. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఓ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వూలో రియ‌ల్ లైఫ్ లో ఎలాంటి అబ్బాయి కావాలంటే? ఠ‌క్కున అర్జున్ రెడ్డి లాంటి కుర్రాడైతే ఎన్ని క‌ష్టాలు ఎదురైనా వ‌దిలిపెట్ట‌నంటూ బ‌ధులిచ్చింది.

నిజ జీవితంలో ప్రీతి , అర్జున్ రెండు పాత్ర‌ల స్వభాలు ఉన్న దాన్ని. ప్రీతి త‌న ఇష్టాల‌ను మాట‌ల్లో చెప్ప‌లేదు. కానీ త‌న నిర్ణ‌యాలు తానే సొంతంగా తీసుకుంటుంది. నేను అంతే. అర్జున్ రెడ్డిలా నేను ల‌క్ష్యం కోసం ఏదైనా చేసేదాన్ని. ద‌క్షిణాదికి వ‌చ్చా అబ్బాయిలపై ఇష్టం పెరిగింది. అర్జున్ రెడ్డి లా్టి నిజాయితీ, ధైర్య ఉన్న వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నా. నాకు తార‌స‌ప‌డితే అలాంటి వాడిని వ‌ద‌ల‌ను. అయితే నా సినిమా పిచ్చితో ఇంట్లో వాళ్ల‌ను మోసం చేసాను. అర్జున్ రెడ్డి లో ముద్దు సీన్లు ఉండ‌వ‌ని ద‌ర్శ‌కుడు నాతో, నాన్న‌తో చెప్పారు. కానీ సెట్స్ లో అందుకు కాంట్రాస్ట్ గా జ‌రిగింది. ఆ విష‌యంలో నాన్న బాగా పీల‌య్యారు. కొన్ని నెల‌లు పాటు మాట్లాడ‌టం మానేసారు. ముద్దు సీన్ల గురించి ముందే తెలిసుంటే న‌టించేదాన్ని కాదేమోన‌ని తెలిపింది.

Also Read: Priyanka Chopra’s Costliest Style Statment

User Comments