ఇలియానాపై ఆండ్రూ వేధింపులా?

ఇలియానా- ఆండ్రూ విడిపోయిన విష‌యం అన్ని మీడియా సంస్థ‌ల్లోనూ హాట్ టాపిక్. పెళ్లికి సిద్ద‌మ‌వుతోన్న వేళ ఇలా జ‌రిగిందేంట‌ని జోరుగా క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి. అస‌లు బ్రేక‌ప్ కార‌ణం ఏంట‌ని బోలెడ‌న్ని విశ్లేష‌ణ‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో స‌రికొత్త రీజ‌న్ తెర‌పైకి వ‌చ్చింది. ఇలియానా సినిమాలు చేయ‌డం మానేయ‌డమే దీనంత‌టికీ కార‌ణం అని ఓ వార్త వినిపిస్తోంది. ఈ విష‌యంపైనే ఇద్ద‌రి మ‌ధ్య పెద్ద త‌గ‌దా జ‌రిగిందిట‌. ఇలియానా సినిమాలు మానేసి ఆండ్రూని పెళ్లి చేసుకుని స్థిర‌ప‌డాల‌ని భావించిందిట‌.

కానీ ఆండ్రూ ఇలియానా మీద ఆధార‌ప‌డి బ్ర‌తుకు బండి లాగించేయాల‌నుకున్నాడు. ఇలియానా సినిమాలు చేస్తే వ‌చ్చే డ‌బ్బుతో బ్ర‌తికేయోచ్చు అన్న లెక్క‌లో ఉన్నాడుట‌. ఈ కార‌ణంగానే ఇద్ద‌రి మ‌ద్య వివాదం త‌లెత్తింద‌ని స‌మాచారం. ఇలియానా సినిమాలు మానేయ‌డంతో ఆండ్రూ విలాసాల‌కు చిల్లు ప‌డింద‌ని ఈ నేప‌థ్యంలో ఇలియానాపై సినిమాలు చేయమని ఒత్తిడి తెచ్చాడట. ఆండ్రూ ఒత్తిడికీ, చేతలకీ విసిగిపోయిన ఇలియానా అతగాడికి బ్రేకప్‌ చెప్పిందంటున్నారు. మ‌రి అస‌లు కార‌ణం ఇదా? ఇంకేవైనా ఉన్నాయా? అన్న‌ది తెలియాలంటే ఇలియానా నోరు విప్పాల్సిందే.

Also Read : Sye Raa Team Bags Geetha Arts Ganesh Laddu