`ఐఫా-2018` పండుగ ఎక్క‌డ‌?

Last Updated on by

ఇంట‌ర్నేష‌న‌ల్ ఇండియ‌న్ ఫిలిం అకాడెమీ (ఐఫా-2018) ఉత్స‌వాలు ప్ర‌తియేటా దుబాయ్‌, బ్యాంకాక్ వంటి చోట్ల అంగ‌రంగ వైభ‌వంగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. డెస్టినీ లొకేష‌న్ల‌లో గ్లామ‌ర్ ఎలివేష‌న్ జిల్‌మ‌నిపిస్తోంది. అటు బాలీవుడ్ స‌హా ఇటు సౌత్ సినీప‌రిశ్ర‌మ‌ల తారాతోర‌ణం అక్క‌డ హ‌రివిల్లునే త‌ల‌పిస్తోంది. ఈసారి కూడా అంత‌కుమించి వెలుగుజిలుగులు ప్ర‌స‌రించేందుకు స్టార్లు రెడీ అవుతున్నారు. తాజాగా ఐఫా 2018 ఉత్స‌వాల షెడ్యూల్ రిలీజైంది.

ఐఫా 2018 జూన్ 22 నుంచి జూన్ 24 వ‌ర‌కూ మూడు రోజుల పాటు బ్యాంకాక్‌లో జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఉత్స‌వాల్లో కార్తీక్ ఆర్య‌న్‌, ఆయుష్మాన్ ఖురానా ఐఫా రాక్స్ కార్య‌క్ర‌మానికి వ్యాఖ్యాత‌లుగా కొన‌సాగ‌నున్నారు. ఓవ‌రాల్ షోకి బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ కం నిర్మాత క‌ర‌ణ్ జోహార్‌, హీరో రితేష్ దేశ్‌ముఖ్ వ్యాఖ్యాత‌లుగా మెరుపులు మెరిపించ‌నున్నారు. ర‌ణ‌బీర్ క‌పూర్‌, షాహిద్ క‌పూర్ వంటి స్టార్లు వేదిక‌పై ప్ర‌త్యేక పెర్ఫామెన్సుల‌తో రంజింప‌జేయ‌నున్నారు. క‌థానాయిక‌లో గ్లామ‌ర్ ఎలివేష‌న్ షోలు, స్కిట్‌లు ఉండ‌నే ఉన్నాయి. మరిన్ని వివ‌రాల్ని తొంద‌ర్లోనే ఐఫా నిర్వాహ‌కులు వెల్ల‌డించ‌నున్నారు.

User Comments