Last Updated on by
ఇలయదళపతి విజయ్ కథానాయకుడిగా 63వ సినిమా చెన్నయ్‌లో ప్రారంభమైంది. అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయిక. విల్లు, శివకాశి వంటి చిత్రాల తర్వాత నయన్ మరోసారి విజయ్ సరసన నటిస్తోంది. తేరి, రాజా రాణి వంటి చిత్రాలతో విజయ్, నయన్ లకు బంపర్ హిట్లు ఇచ్చిన అట్లీ ఆ ఇద్దరినీ కలిపి మరో బ్లాక్ బస్టర్ అందించాలని తపిస్తున్నాడు.
తాజాగా ఇలయదళపతి కోసం పెప్పీగా ఉండే కథాంశాన్ని ఎంచుకున్నాడు. మారిన ట్రెండ్ లో రెగ్యులర్ మాస్ మసాలా సినిమా కాకుండా ఈసారి స్పోర్ట్స్ నేపథ్యం ఉన్న స్టోరిని ఎంపిక చేసుకున్నాడు. విజయ్ ఈ చిత్రంలో లేడీ ఫుట్ బాల్ టీమ్ కోచ్ గా కనిపిస్తాడట. ఫుట్ బాల్ టీమ్ లీడ్ పాత్రలో నయనతార కనిపిస్తుందేమో చూడాలి. తాజాగా సినిమా ప్రారంభోత్సవ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
User Comments