అటో విజ‌య్.. ఇటో విజ‌య్..!

Last Updated on by

విజ‌య్ అనే పేరుంటే చాలు.. విజ‌యం వ‌చ్చేస్తుందేమో మ‌రి..? ఇప్పుడు తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీల్లో విజ‌య్ పేరుతో ముగ్గురు స్టార్స్ ఉన్నారు. ఇప్ప‌టికే ఇళ‌య‌త‌ల‌ప‌తి విజ‌య్ సూప‌ర్ స్టార్ గా చ‌క్రం తిప్పుతున్నాడు. ఇక ఇప్పుడు విజ‌య్ సేతుపతి కూడా మ‌క్క‌ల్ సెల్వ‌న్ అంటూ అంద‌రి మ‌న‌సులు గెలుచుకుంటున్నాడు. తెలుగులో అర్జున్ రెడ్డితో విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్ అయిపోయాడు. ఇక ఇప్పుడు ఈ ముగ్గురు న‌టించిన సినిమాలే ఫిల్మ్ ఫేర్ ను దున్నేసాయి.

విజ‌య్ న‌టించిన మెర్స‌ల్ కొన్ని అవార్డులు తీసుకెళ్లిపోయింది. ఇక మ‌రో విజ‌య్ న‌టించిన విక్ర‌మ్ వేధ అన్ని అవార్డులు ఎగరేసుకుపోయింది. ఉత్త‌మ న‌టుడిగానూ విజ‌య్ సేతుప‌తి ఫిల్మ్ ఫేర్ అందుకున్నాడు. ఆయ‌న‌తో పాటు న‌టించిన మాధ‌వ‌న్ క్రిటిక్స్ కోటాలో ఉత్త‌మ న‌టుడు అయ్యాడు. ఇక తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాకు గానూ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు బెస్ట్ యాక్ట‌ర్ అవార్డ్ వ‌చ్చింది. అలా అటు విజ‌య్.. ఇటు విజ‌య్.. ఎటు చూసిన విజ‌య్ లే ఈ సారి ఫిల్మ్ ఫేర్ అవార్డుల‌ను డామినేట్ చేసారు. అన్న‌ట్లు విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ఫిల్మ్ ఫేర్ అవార్డును తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్ కు ఇచ్చేసాడు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా విజ‌య్ చేసిన ప‌నికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు.

User Comments