సౌత్ డైరెక్టర్స్ కు నడుము మాత్రమే కావాలట..!

Last Updated on by

గోవాబ్యూటీ.. జ‌ఘ‌న సుంద‌రి.. న‌డుమొంపుల వ‌య్యారి.. ఇలా ఎన్ని పేర్ల‌తో పిలిచినా ఇలియానాకు స‌రిగ్గా సూట్ అవుతాయి. దాదాపు ఆరేళ్ల పాటు తెలుగు ఇండ‌స్ట్రీని త‌న అందాల‌తో అల్ల‌క‌ల్లోలం చేసింది ఈ ముద్దుగుమ్మ‌. తెలుగు ఇండ‌స్ట్రీలో అయితే ఈ భామని రాణిలా చూసుకున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అడిగిందంతా ఇచ్చారు. కోటితారును చేసారు. ఇంతా చేసిన ద‌క్షిణాది ఇండ‌స్ట్రీపై ఇప్పుడు నోరు పారేసుకుంటుంది ఇలియానా. బాలీవుడ్ ఉంద‌నే ధైర్య‌మో ఏమో కానీ ఇప్ప‌టికీ ఈ భామ పొగ‌రు మాత్రం దిగ‌లేదు. ఇష్ట‌మొచ్చిన‌ట్లు కామెంట్ చేసింది. ముఖ్యంగా తెలుగు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను అయితే నోటికొచ్చిన‌ట్లు మాట్లాడేసింది ఇల్లీబేబీ. ఇక్క‌డి వాళ్ల‌కు హీరోయిన్లు అంటే కేవ‌లం అందాలు చూపించే యంత్రాలు అంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేసింది గోవాబ్యూటీ.ileana d'cruz Controversy Statement on Tollywood Industry

తాను తెలుగు సినిమాలో న‌టించే స‌మ‌యంలో అక్క‌డి సినిమాలు ఎలా తీస్తారో తెలిసేది కాదని.. తొలి సినిమా దేవ‌దాస్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో త‌న న‌డుముపై వైవిఎస్ చౌద‌రి శంఖం వేసే సీన్ ఒక‌టి చిత్రీక‌రించార‌ని చెప్పింది ఇలియానా. అలా ఎందుకు చేస్తున్నార‌ని అడిగితే.. నీ నడుము చాలా బాగుంది. ఈ సీన్ చేస్తే సినిమాలో ఇంకా బాగుంటుంది అని చెప్పాడంది. ఈ లాజిక్ ఏంటో ఇప్ప‌టికీ త‌న‌కు అర్థం కాలేదంటుంది ఇలియానా. తాను న‌టించే ప్ర‌తీ సినిమాలోనూ న‌డుం బాగుంది.. చూపించేద్దాం అనేవాళ్ల‌ని.. ఇండియాలో ఆడ‌వాళ్ల అందాన్ని సినిమాల్లో ఈ రకంగా చూపిస్తుంటారని.. ముఖ్యంగా సౌత్ లో ఇది మ‌రీ ఎక్కువ‌ని చెప్పింది ఈ భామ‌.ileana d'cruz Controversy Statement on Tollywood Industry

ఇలాంటి న‌డుము సన్నివేశాలు వచ్చినప్పుడు త్వరగా చేసేయాలని అనుకునేదాన్న‌ని చెప్పింది గోవాబ్యూటీ. అస‌లు న‌డుం చూపించే సీన్స్ లో న‌టించ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని.. కానీ ద‌ర్శ‌కులే ప‌ట్టుబ‌ట్టే వాళ్లంటూ చెప్పింది ఈ భామ‌. అయితే బాలీవుడ్ లో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు త‌నకు ఇలాంటి అనుభవాలు ఎదురుకాలేదని చెప్పింది ఇలియానా. దక్షిణాది ఇండ‌స్ట్రీ ఇంకా మారలేదు. ఈ సీన్స్ ఇప్ప‌టికీ కన్పిస్తున్నాయి. బహుశా తెలుగు ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల అందాన్ని ఇలాగే చూస్తారేమో అంటూ సెటైర్ వేసింది ఇలియానా. త‌న‌కు 18 ఏళ్లున్నప్పుడే దక్షిణాదిన ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ అవన్నీ డబ్బు కోసమే చేశాను. కానీ కొన్నాళ్ల త‌ర్వాత అలాంటి సినిమాలు చేయ‌కూడ‌ద‌ని ఫిక్స్ అయ్యాన‌ని.. అందుకే ఇప్పుడు సౌత్ లో న‌టించ‌ట్లేద‌ని చెప్పింది ఇలియానా. ఏదేమైనా సినిమాలు చేసిన‌పుడు మాత్రం సూప‌ర్ అని.. ఇప్పుడు ఇలా విమ‌ర్శించ‌డం మాత్రం త‌ప్పంటున్నారు విశ్లేష‌కులు.ileana d'cruz Controversy Statement on Tollywood Industry

User Comments