సౌత్ లో ఎంజాయ్ చేయలేకపోయిన ఇలియానా

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ టైమ్ లో ఓ వెలుగు వెలిగి తర్వాత కనుమరుగైపోయిన భామల్లో ఇప్పుడు ముందుగా గోవా బ్యూటీ ఇలియానా గురించి చెప్పుకోవాల్సిందే. పోకిరి లాంటి సినిమాతో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన ఇలియానా.. తర్వాత బాలీవుడ్ కు చెక్కేసి అక్కడే సెటిల్ అయిపోయాలనే గట్టి ప్రయత్నాలే చేసింది. ఈ క్రమంలో మొదట బర్ఫీ లాంటి హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నా తర్వాత వరుస ఫ్లాపులతోనూ, చిన్న చిన్న వివాదాలతోనూ ఇలియానా బాలీవుడ్ లో కూడా తడబడింది.

దీంతో ఎటూ కాకుండా గోవా బీచ్ లకే పరిమితమైపోయింది. ఇక ఇప్పుడేమో మళ్ళీ ఓ రెండు బాలీవుడ్ సినిమాలను ఇలియానా తన చేతిలో పెట్టుకోవడంతో.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలనుకున్న తన ఆశలకు మళ్ళీ ప్రాణం పోస్తుంది. అందుకేనేమో ఇప్పుడు తనకు మొదట కెరీర్ ఇచ్చిన సౌత్ సినిమాల గురించి కూడా ఈసారి కొంచెం పాజిటివ్ గానే మాట్లాడుతుంది. ఈ మేరకు తాజాగా సౌత్ సినిమాలు అసలు ఎందుకు వదిలేసినట్లు అన్న విషయంపై ఇలియానా స్పందిస్తూ.. సౌత్ లో నటించిన సమయంలో పెద్ద తప్పు చేశానని చిన్న స్వీట్ షాక్ ఇచ్చింది.

అనంతరం సౌత్ లో ఒకేసారి బోలెడు సినిమాలకు కమిట్ అయిపోయానని, దాంతో క్షణం తీరిక ఉండేది కాదని, ఒక సెట్ నుంచి మరో సెట్ కు పరుగులు తీస్తూ ఉండేదానినని. ఈ కారణంగా ఫిల్మ్ మేకింగ్ ను సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయానని ఇలియానా పేర్కొంది. అయితే, ఆ ఎంజాయ్ మెంట్ లేకపోయినా సౌత్ సినిమాల్లో ఎన్నో గ్లామర్ రోల్స్ చేశానని, అవన్నీ నాకు ఎంతో నచ్చాయని ఇలియానా వివరించడం విశేషం. ఇదిలా ఉంటే, ఇలియానా ఇప్పుడు అజయ్ దేవగన్ హీరోగా మిలన్ లూథ్రియా దర్శకత్వంలో తెరకెక్కిన బాద్షాహో సినిమాలోనూ, అనీస్ బాజ్మీ డైరెక్షన్లో అర్జున్ కపూర్ హీరోగా తెరకెక్కిన ముబారకన్ సినిమాలోనూ హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాలూ రిలీజ్ కు రెడీ అవుతుండటంతో.. ఇప్పుడైనా ఇలియానా ఫేట్ మారుతుందేమో చూడాలి.

Follow US