ఫిజీని ఒణికించిన ఇల్లూ

Last Updated on by

ఆస్ట్రేలియ‌న్ ప్రియుడు నీబోన్‌తో క‌లిసి ఒంట‌రి దీవుల‌కు షికార్లు చేయ‌డంలో ఇలియానా బిజీబిజీగా ఉంది. ఓవైపు బాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తూనే, వీలున్న‌ప్పుడ‌ల్లా షికార్ల‌కు వెళుతోంది. ప్ర‌స్తుతం ఈ భామ ఫిజీ ప‌ర్య‌ట‌న‌లో క్ష‌ణం తీరిక లేనంత బిజీగా గ‌డిపేస్తోంది. అక్క‌డ స‌ర్ఫింగ్ చేస్తోంది. స‌ముద్రంలో జ‌ల‌కాలాడుతోంది. ఇసుక తిన్నెల‌పై నీబోన్ తో క‌లిసి అడుగులో అడుగు వేస్తూ లెక్క‌పెడుతోంది. ఈ మొత్తం సంగ‌తుల్ని నీబోన్ త‌న కెమెరాలో బంధించేస్తున్నాడు. అలా తీసిన ఫోటోల్ని ఒక్కొక్క‌టిగా వ‌దులుతూ ఇలియానా.. జ్ఞాప‌కాల్లోకి వెళుతోంది.

ఇదిగో లేటెస్టుగా ఫిజీలో స‌ర్ఫింగ్ గొప్ప‌త‌నాన్ని చెబుతూ ఇలా ఓ ఫోటోని ఇన్‌స్టాగ్ర‌మ్‌లో పోస్ట్ చేసింది. వ‌ర‌ల్డ్ క్లాస్ స‌ర్ఫింగ్ చేయాలంటే ఫిజీ రావాల్సిందే. స‌ర్ఫింగ్‌ని ప్రేమిస్తే, ఫిజీని ప్రేమించిన‌ట్టే అని చెప్పింది. ఇంత‌కీ ఇలియానా ఎందుకు ఫిజీని ఇంత‌గా ప్ర‌మోట్ చేస్తోంది? అంటారా.. అస‌లు ఫిజీకి బ్రాండ్ అంబాసిడ‌ర్ త‌నే క‌దా! ఆ క్ర‌మంలోనే ఇలియాన‌- నీబోన్ జంట‌కు రెగ్యుల‌ర్‌గా ఆ దేశం విమాన టిక్కెట్లు ఆఫ‌ర్ చేస్తూ త‌మ దేశానికి ప్ర‌మోష‌న్ చేయించుకుంటోంది. ఈ కాంట్రాక్ట్ ఇంకా కొద్దిరోజులు కొన‌సాగ‌నుంది. ఇలియానా ప్ర‌స్తుతం ర‌వితేజ స‌ర‌స‌న `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

User Comments