నాట్ ఫ్రెగ్నెంట్ – ఇలియానా

Last Updated on by

బాలీవుడ్ వెళ్లిన‌ప్ప‌టినుంచి ఇలియానా వ్య‌వ‌హారంపై ఎప్ప‌టికప్పుడు మ‌న‌వాళ్ల‌కు రిపోర్ట్ అందుతున్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ అడుగుపెట్టే ముందే ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోన్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం కాస్తా, ప్రేమ‌గా మారింది. ఆ ప్రేమ వ్య‌వ‌హారం కాస్తా స‌హ‌జీవ‌నానికి దారి తీసింది. అయితే స‌న్నివేశం అక్క‌డితో ఆగిందా.. అంటే అబ్బే అస్స‌లు ఆగ‌లేదు. ఈ ప‌య‌నం పీక్స్‌లో టేకాఫ్ అయ్యి, ఇలియానా ఇప్పుడు ఏకంగా గ‌ర్భం కూడా దాల్చింద‌న్న ప్ర‌చారం సాగుతోంది. నిప్పు లేనిదే పొగ రాదంటారు. అదే కోవ‌లో ఇలియానా వ్య‌వ‌హారికం చూసిన ఉత్త‌రాది మీడియా.. ఆ గుట్టు కాస్తా లీక్ చేసేసింది. అది ఆ నోటా ఈనోటా ప‌బ్లిక్ టాక్‌ అయ్యి, ఇప్పుడు సౌత్ ఇండ‌స్ట్రీలోనూ దీనిపై వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది.

టాలీవుడ్‌లో ఓ టాప్ హీరోని ప్రేమించి మోస‌పోయాన‌ని ఇదివ‌ర‌కూ ఓ సంద‌ర్భంలో వెల్ల‌డించిన ఇలియానా, పేరు మాత్రం చెప్ప‌లేదు. అయితే అదంతా గ‌తం గ‌తః అనుకుంటే, వ‌ర్త‌మానంలో ఆండ్రూ నీబోన్‌ని ఈ భామ ర‌హ‌స్యంగా వివాహం చేసుకుంద‌ని, అయితే ఆ విష‌యం లీక‌వ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతోంద‌న్న కోణంపైనా బాలీవుడ్‌లో విరివిగా చ‌ర్చ సాగింది. బిలియ‌న్ డాల‌ర్ ప‌రిశ్ర‌మ‌లో పెళ్లి అన్న మాట బ‌య‌ట‌కు చెప్ప‌డం నేరం! అన్న సూత్రాన్ని తూ.చ త‌ప్ప‌క అనుస‌రిస్తున్న ఇలియానా ఇప్ప‌టికి పెళ్లి అయ్యింది అన్న మాట అంగీక‌రించ‌దు. త‌న‌కు వ‌రుస‌గా అవ‌కాశాలు రావాలంటే, ఏ విష‌య‌మూ బ‌య‌టికి చెప్ప‌కూడ‌ద‌ని త‌లుస్తోంది. అందుకే ఇలా ఆండ్రూతో వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట‌కు చెప్ప‌ద‌ని అంటారు. అయితే ఇటీవ‌లి కాలంలో త‌న‌పై సాగించిన ప్ర‌చారంపై ఇల్లూ కాస్తంత సీరియ‌స్‌గానే ఉంద‌ని తాజా ట్వీట్ చెబుతోంది. `నాట్ ఫ్రెగ్నెంట్‌`(గ‌ర్భిణి కాను) అంటూ రెండు ప‌దాల్లో ట్వీట్ చేసినా దానివెన‌క చాలా ఎత్తుగ‌డే ఉంద‌ని భావించాల్సి వ‌స్తోంది. ఇదివ‌ర‌కూ ఓ ఇంట‌ర్వ్యూలో ఇలియానా త‌న బోయ్‌ఫ్రెండ్‌తో ఉన్న వ్య‌వ‌హారం అంతా అంగీక‌రించింది. సినిమా అంతా ప‌బ్లిగ్గానే చూసి, చివ‌రికి ఏమైంది? అని వెర్రివెంగ‌ల‌ప్పాయ్‌ల్లా అమాయ‌కంగా ప్ర‌శ్నిస్తారా? అంటూ ఓ టీవీ చానెల్ లైవ్‌లోనే తిక్క‌గా తిట్టేసింది ఇలియానా.

User Comments