ఇల్లూబేబీకి అరుదైన రుగ్మ‌త‌

Last Updated on by

అందాల క‌థానాయిక ఇలియానా ప్ర‌స్తుతం హిందీ ప‌రిశ్ర‌మ‌ను ఏలాల‌ని క‌ల‌లుగంటున్న‌ సంగ‌తి తెలిసిందే. ముంబై ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంటూ తాను క‌న్న‌ క‌ల‌ల్ని నెర‌వేర్చుకునే ప‌నిలో ఉంది. అంతేకాదు.. ఈ భామ ఫిజీ దేశానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గానూ సేవ‌లందిస్తోంది. ప‌నిలో ప‌నిగా ఫిజీ దీవుల్లో బోయ్‌ఫ్రెండ్ నీబోన్‌తో విహ‌రిస్తూ ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌ల్లోకొస్తోంది.

ప్ర‌స్తుతం ఫిజీ దీవుల‌కు కావాల్సిన ప్ర‌మోష‌న్ చేస్తోంది ఇల్లూ. అక్క‌డ స‌ర్ఫింగ్‌కి ప్ర‌పంచ‌దేశాల్లో ఇమేజ్ పెరిగేందుకు త‌న‌వంతు ప్ర‌చారం చేస్తోంది. టూరిస్టుల‌కు త‌న‌దైన సందేశం ఇస్తూ వెల్‌కం చెబుతోంది. ఫిజీలో స‌ర్ఫింగ్ తో పాటు స్కై డైవింగ్‌కి అంతే ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. మొన్న‌టికి మొన్న స‌ముద్ర కెర‌టాల‌పై హైస్పీడ్‌తో స‌ర్ఫింగ్ చేసిన ఇలియానా.. ఇప్పుడు ఏకంగా స్కై డైవ్ చేస్తోంది. ఇదిగో ఈ ఫోటోనే అందుకు సాక్ష్యం. అన్న‌ట్టు .. స‌న్న‌జాజి ఇలియానాకు చాలా కాలం క్రితం ఓ రోగం ఉండేది. దానిపేరు బాడీ డిస్‌మార్ఫిక్ డిజార్డ‌ర్‌. అయ్యయ్యో లావెక్కిపోతున్నామేమో! అరెరే తిండి క‌ట్టేయాలేమో! .. ఇలా అయితే క‌ష్టం!! అంటూ బాధ‌ప‌డిపోయే అరుదైన రోగ‌మిది. అయితే ఆరంభ కెరీర్‌లో ఇలాంటి అపోహ‌ల్లో బ‌తికాన‌ని, ఇప్పుడు ఆ ఊహ‌లేవీ లేవ‌ని ఇలియానా తేల్చి చెప్పింది. ఇక‌పోతే పూర్తి స్థాయి ప‌రిణ‌తితో మెలుగుతున్న ఇలియానా .. ఫిజీ దేశానికి పెర్ఫెక్ట్ బ్రాండ్ అంబాసిడ‌ర్ అంటూ కితాబు అందుకుంటోంది.

User Comments