ఓపెనింగ్స్ కు ఫిక్సైపోయిన ఇలియానా..

జ‌ఘ‌న సుంద‌రి.. టాప్ హీరోయిన్.. కోటి తార‌.. సౌత్ ఇండ‌స్ట్రీలో ఉన్న‌పుడు ఇలియానాను ముద్దుగా పిలుచుకున్న పేర్లు ఇవి. ఇక్క‌డ అమ్మాయి ఆడిందే ఆట‌.. పాడిందే పాట‌. అడిగేవాడు అస్స‌లే లేడు. టాప్ హీరోయిన్ గా ఉన్న‌పుడే బాలీవుడ్ పురుగు కుట్టేసింది. అంతే.. ఇంకేముంది ద‌క్షిణాది ఇండ‌స్ట్రీని చిన్న‌చూపు చూసి.. బాలీవుడ్ కు ఎగిరిపోయింది. ఇప్పుడు అక్క‌డ వాళ్లు ఈమెను చిన్న‌చూపు చూస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు హిట్లు వ‌స్తున్నాయి కానీ ఇమేజ్ మాత్రం రావ‌డం లేదు. ఎన్ని సినిమాలు చేసినా.. ఇలియాన‌ను స్టార్ హీరోలు మాత్రం అస్స‌లు ప‌ట్టించుకోవ‌ట్లేదు.

 

ఈ మ‌ధ్యే విడుద‌లైన బాద్ షాహో ప‌ర్లేద‌నిపించినా కూడా ఇల్లీబేబీ జాత‌కం మార‌లేదు. ఈ చిత్రంలో ఏకంగా న్యూడ్ గా కూడా న‌టించింది ఇలియానా. ఓ స‌న్నివేశం కోసం అజ‌య్ దేవ్ గ‌న్ ముందు న్యూడ్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. పైగా సినిమాలో ముద్దులు.. హాట్ సీన్ల‌తో రెచ్చిపోయింది ఈ జ‌ఘ‌న సుంద‌రి. మొత్తానికి బాలీవుడ్ లో ఇప్పుడు అందాలే ఆయుధంగా ముందుకెళ్తున్నా కూడా ఇలియానాకు అవ‌కాశాలు మాత్రం రావ‌డం లేదు.

 

దాంతో చేసేదేం లేక‌.. ఓపెనింగ్ తార‌గా మిగిలిపోయింది. అదేనండీ.. షాప్ ఓపెనింగ్ లు.. ఫోన్ ఓపెనింగ్ ల‌కు వ‌స్తూ అందాలు ఆర‌బోస్తుంది ఈ గోవాబ్యూటీ. అందుకే మ‌రి.. దూర‌పు కొండ‌లు నునుపు అని ఊరికే అన‌లేదు..!