పూరీ, రానా, ప్రగతి ఆంటీతో ఇలియానా..!

టాలీవుడ్ కు ప్రస్తుతం దూరంగానే ఉంటున్న గోవా బ్యూటీ ఇలియానా గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. దేవదాసు సినిమాతో మొదలెట్టి పోకిరి సినిమాతో టాలీవుడ్ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈ నడుం సుందరి ఆ మధ్య బాలీవుడ్ కు చెక్కేసిన విషయం అందరికీ తెలుసు.

అలాగే బాలీవుడ్ లో అమ్మడు కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదనే విషయం కూడా అర్థమైపోయింది.

ఈ నేపథ్యంలో ఇలియానా నటించిన ముబారకన్ సినిమా కూడా రీసెంట్ గా  రిలీజై పెద్దగా ప్రభావం చూపకపోవడంతో.. ఈ గోవా బ్యూటీ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

అందుకేనేమో ఈ గోవా సుందరి మళ్ళీ టాలీవుడ్ భజన చేస్తోందని అంటున్నారు.

ఈ మేరకు తాజాగా మీడియాతో మాట్లాడిన ఇలియానా.. ఐ యామ్ మిస్సింగ్ హైదరాబాద్ అంటూ టాలీవుడ్ తో తన అనుబంధం గురించి మళ్ళీ ఓసారి గుర్తుచేసే ప్రయత్నం చేసింది.

ఈ సందర్బంగా నేను ఇప్పటికీ పూర్తిగా పూరీ జగన్నాథ్ తోనూ, రానా దగ్గుబాటి తోనూ టచ్ లోనే ఉన్నానని చెప్పుకొచ్చిన ఇలియానా.. అలాగే ప్రగతి ఆంటీ తో కూడా టచ్ లో ఉన్నానని సెలవిచ్చింది.

ఇదే సమయంలో హైదరాబాద్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టమని, చాలా మిస్ అవుతున్నానని పేర్కొంది.

ఇదిలా ఉంటే, పూరీతో పోకిరి కాకుండా రానాతో కలిసి నేను నా రాక్షసి సినిమాలో కూడా ఇలియానా నటించిన విషయం తెలిసిందే.

దీంతో ఇల్లూ బేబీకి పూరీ అండ్ రానాలు మంచి దోస్తీలు అయిపోయారని సమాచారం.

ఇకపోతే, బాలీవుడ్ లోనే చేతిలో బాద్షాహో అంటూ మరో సినిమాను రెడీగా పెట్టుకున్న ఇలియానా.. ఆ సినిమాతో ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

ఒకవేళ అది కూడా సరైన ఫలితాన్ని ఇవ్వకపోతే, అమ్మడు టాలీవుడ్ వైపు అడుగులు వేసినా ఆశ్చర్య పోవక్కర్లేదు.

కానీ, ఇక్కడే గోవా బ్యూటీకి అవకాశాలు ఇచ్చేవాళ్ళు కనిపించడం లేదు మరి.

Follow US