6రోజుల్లో బాహుబలి రికార్డ్ బ్రేక్

బాహుబ‌లి` సిరీస్ అజేయ‌మైన రికార్డుల్ని బ్రేక్ చేసే సినిమా వ‌స్తుందా? అంటూ గ‌త కొంత‌కాలంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతూనే ఉంది. అమీర్- అమితాబ్ న‌టించిన‌ `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్` లాంటి భారీ చిత్రం బాహుబ‌లి 2 రికార్డుల్ని బ్రేక్ చేయ‌క‌పోయినా క‌నీసం బాహుబ‌లి 1 రికార్డుల్ని కూడా బ్రేక్ చేస్తుంద‌ని భావించారు. కానీ ఆ రికార్డును కొట్ట‌డం మాట అటుంచితే, ఈ భారీ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాపైంది. అమీర్ ఖాన్ అంత‌టివాడికే బాహుబ‌లి రికార్డును కొట్టే స‌త్తా లేద‌ని తేలిపోయింది.

ఆ క్ర‌మంలోనే 2.0 చిత్రం అయినా బాహుబ‌లి రికార్డును అందుకుంటుందా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ అభిమానుల్లో సాగింది. అయితే ర‌జ‌నీ అభిమానుల్లో ఉత్సాహం నింపుతూ 2.0 డే1 నుంచి పాజిటివ్ టాక్‌తో చ‌క్క‌ని వ‌సూళ్లు సాధించింది. ఆస‌క్తిక‌రంగా ఈ సినిమా తెలుగు, త‌మిళ్ కంటే హిందీ వెర్ష‌న్ పెద్ద విజ‌యం సాధించింద‌ని త‌ర‌ణ్ ఆద‌ర్శ్ త‌న రిపోర్టుల్లో వెల్ల‌డించారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. బాహుబ‌లి ఫుల్ ర‌న్‌ రికార్డును 2.0 బ్రేక్ చేసింది. అది కూడా కేవ‌లం 6రోజుల్లో ఈ రికార్డును బ్రేక్ చేసి స‌త్తా చాటింది. 2015లో రిలీజైన `బాహుబ‌లి: ది బిగినింగ్` హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద ఫుల్ ర‌న్‌లో 117కోట్లు వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది. నాన్ హిందీ సినిమాల్లో అనువాదాల్లో బెస్ట్ రికార్డు ఇదే. దానిని ఆ త‌ర్వాత బాహుబ‌లి 2 బ్రేక్ చేసింది. ఈ సినిమా ఫుల్ ర‌న్‌లో ఏకంగా 511 కోట్లు వ‌సూలు చేసి ద‌రిదాపుల్లో ఎవ‌రూ బ్రేక్ చేయ‌లేని రికార్డును నెల‌కొల్పింది. అంత‌కుముందు ఉన్న రికార్డులన్నిటినీ బాహుబ‌లి2 వేటాడింది. ఆస‌క్తిక‌రంగా దేశంలోనే నంబ‌ర్ 1 క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాగా బాహుబ‌లి 2 చ‌రిత్ర సృష్టించింది. హిందీ సినిమాల్ని బీట్ చేసి బాక్సాఫీస్ వ‌ద్ద టాప్ మూవీగా రికార్డుల‌కెక్కింది. ఇండియాలో వ‌సూళ్ల ప‌రంగా అమీర్ ఖాన్ `దంగ‌ల్‌`ని వెన‌క్కి నెట్టి నంబ‌ర్ 1 స్థానాన్ని అందుకుంది బాహుబ‌లి2. ఇప్ప‌ట్లో ఈ సినిమా రికార్డుల్ని బ్రేక్ చేయ‌డం అంత వీజీ కాదని తేలిపోయింది. ఖాన్‌ల త్ర‌యంలో ఎవ‌రి వల్లా కాద‌ని అంగీక‌రించే ప‌రిస్థితి నెల‌కొందిప్పుడు. అయితే సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన 2.0 అన్ని రికార్డుల్ని బ్రేక్ చేస్తుంద‌ని భావించినా ఈ సినిమా కూడా ఆ ఫీట్‌ని నిజం చేయ‌లేక‌పోయింది. కేవ‌లం బాహుబ‌లి1 రికార్డును మాత్రం ఇప్ప‌టికి బ్రేక్ చేయ‌గ‌లిగింది. 2.0 హిందీ వెర్ష‌న్ కేవ‌లం 6రోజుల్లో 117 కోట్ల మార్కును అధిగ‌మించింద‌ని ప్ర‌ఖ్యాత క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశారు. అయితే ఫుల్ ర‌న్‌లో బాహుబ‌లి 2 రికార్డును కొట్టేసే స‌న్నివేశం లేదు.

User Comments