ఆస్కార్ సినిమా సీక్వెల్ హ‌వా

Last Updated on by

భార‌త‌దేశంలో హాలీవుడ్ సినిమాల వెల్లువ అంత‌కంత‌కు పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. బ్లాక్ పాంథ‌ర్‌, డెడ్‌పూల్ 2 చిత్రాలు ఇటీవ‌ల రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించాయి. డైనోసార్ బ్యాక్‌డ్రాప్ మూవీ `జురాసిక్ వ‌ర‌ల్డ్ 2` భార‌త‌దేశంలో ఏకంగా 117 కోట్లు (17 మిలియ‌న్ డాల‌ర్లు) వ‌సూలు చేసింది. ఇప్ప‌టికీ థియేట‌ర్ల‌లో విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోంది. అయితే అనూహ్యంగా వీట‌న్నిటినీ కొట్టేస్తూ ఓ యానిమేష‌న్ సినిమా సాధిస్తున్న వ‌సూళ్లు హాట్ టాపిక్ అయ్యాయి.

ఆస్కార్ సినిమా `ది ఇన్‌క్రెడిబుల్స్‌`కి సీక్వెల్‌గా వ‌చ్చిన యానిమేష‌న్ సినిమా `ఇన్‌క్రెడిబుల్స్ 2` భార‌త‌దేశంలో దుమ్ము దులిపేస్తోంది. ఈ సినిమా 3డి వెర్ష‌న్ మిరాకిల్స్ చేస్తోంద‌నే చెప్పాలి. కేవ‌లం తొలి వీకెండ్ నాటికే ఈ సీక్వెల్ చిత్రం భార‌త‌దేశంలో 23 కోట్లు (3.3 మిలియ‌న్ డాల‌ర్లు) వ‌సూలు చేసింది. ది ఇన్‌క్రెడిబుల్స్ 2005లో రిలీజైంది.డిస్నీ పిక్షార్ నిర్మించిన ఈ యానిమేష‌న్ చిత్రం యానిమేటెడ్ సినిమాల్లోనే ది బెస్ట్‌గా రికార్డుల‌కెక్కింది. ఉత్త‌మ యానిమేష‌న్ సినిమా, ఉత్త‌మ సౌండ్ ఎడిటింగ్ విభాగాల్లో ఆస్కార్‌లు గెలుచుకుంది. తాజాగా రిలీజైన ఇన్‌క్రెడిబుల్స్ 2 చిత్రానికి 2019లో ఆస్కార్ పుర‌స్కారాలు గ్యారెంటీ అన్న చ‌ర్చ సాగుతోంది.

User Comments