`భార‌తీయుడు -2` ఫ‌స్ట్ లుక్‌

Last Updated on by

భార‌తీయుడు 2 ఈనెల‌ 18 నుంచి సెట్స్ పైకి వెళుతోంది. సేనాప‌తి వార్ షురూ చేశాడు. రాజ‌కీయ అవినీతిపై ఈసారి యుద్ధాన్ని ప‌రాకాష్ట‌లో చూపించ‌బోతున్నాడు శంక‌ర్. ప్ర‌స్తుత స‌మాజంలో పేరుకుపోయిన రాజ‌కీయ అవినీతి ప్ర‌జాజీవ‌నాన్ని ఎలా అత‌లాకుత‌లం చేస్తోందో శంక‌ర్ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించ‌నున్నారట‌. ఈ చిత్రాన్ని త‌మిళంలో ఇండియ‌న్ 2, హిందీలో హిందూస్తాన్ 2 పేరుతో రిలీజ్ చేస్తారు.

తాజాగా ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. సేనాప‌తి రెండు వేళ్ల‌ను మ‌డ‌త పెట్టి పోటు పొడిచేందుకు రెడీ అవుతున్న లుక్‌ని రివీల్ చేశారు. 2.0 గ్రాండ్ స‌క్సెస్ త‌ర్వాత లైకా సంస్థ రెట్టించిన ఉత్సాహంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 500కోట్ల బ‌డ్జెట్ ఖ‌ర్చు చేయ‌నుందిట‌. “జ‌న‌వ‌రి 18 నుంచి ఫోక‌స్ పెడుతున్నాం“ అంటూ ట్యాగ్ లైన్‌తో పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంది. ఈ చిత్రంలో చంద‌మామ కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

User Comments