ఇండియాలో అబ్బాయిలే లేరా..?

Last Updated on by

ఛీఛీ.. ఈ అనుమానం ఇప్పుడు ఎందుకు వ‌చ్చింది అనుకుంటున్నారా..? ఏమో ఇప్పుడు కొంద‌రు హీరోయిన్లు చేస్తోన్న ప‌నులు చూస్తుంటే ఇదే అనుమానం వ‌స్తుంది మ‌రి. ఇంత‌కీ ఏం చేసారు వాళ్లు అనుకుంటున్నారా..? అయితే ఈ క‌థ వినండి.. అన‌గ‌న‌గా ఒక్క‌రు ఇద్ద‌రు కాదు.. న‌లుగురు హీరోయిన్లు. వాళ్లంద‌రి చూపు ఇండియన్ అబ్బాయిలపై కాకుండా ఫారెన్ కుర్రాళ్ల‌పై ప‌డింది. వాళ్ళంతా స్టార్ హీరోయిన్లే. వాళ్లు సై అనాలే కానీ మ‌న ద‌గ్గ‌ర ఎంతోమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా క్యూలో ఉంటారు. కానీ వాళ్లు మాత్రం త‌మ‌కు కావాల్సిన వాళ్ల‌ను ఫారెన్ నుంచి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు శ్రీ‌య కూడా ఇదే చేస్తుంది. ఈమె త‌న బాయ్ ఫ్రెండ్.. త్వ‌ర‌లో కాబోయే భ‌ర్త‌ను ర‌ష్యా నుంచి తెచ్చుకుంటుంది. 18 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నా ఇప్ప‌టికీ వ‌ర‌స అవ‌కాశాల‌తో దూసుకుపోతున్న శ్రీ‌యాకు ఇప్పుడు పెళ్లిపై గాలి మ‌ళ్ళింది. కానీ ఆ గాలి ప‌క్క దేశం వైపు మ‌ళ్లింది.

శ్రీ‌య కంటే ముందే ప‌క్క దేశానికి కోడ‌లైపోయిన ముద్దుగుమ్మ ఇలియానా. ఈ గోవాబ్యూటీ ఆస్ట్రేలియ‌న్ ఫోటోగ్ర‌ఫ‌ర్ ఆండ్ర్యూ నిబోన్ తో కొన్నాళ్లుగా ప్రేమ‌లో ఉంది. ఈ మ‌ధ్యే సీక్రేట్ గా పెళ్లి కూడా చేసుకుంది ఈ జ‌ఘ‌న సుంద‌రి. ఇక శృతిహాస‌న్ సైతం ప‌క్క దేశం అబ్బాయితోనే చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతుంది. ఇప్ప‌టికే త‌న ప్రియుడు మైఖెల్ కోర్సెల్ ను కుటుంబానికి కూడా ప‌రిచ‌యం చేసింది ఈ భామ‌. మూడేళ్లుగా అత‌డితోనే డేటింగ్ లో ఉంది శృతిహాస‌న్. ఇక రాధికాఆప్టే అయితే వీళ్లందరి కంటే ముందే బ్రిట‌న్ కు కోడ‌లైపోయింది. 2012లోనే అక్క‌డి మ్యూజిక్ కంపోజర్ బెన్ డిక్ట్ టైల‌ర్ తో ఏడ‌డుగులు న‌డిచింది రాధికా ఆప్టే. బాలీవుడ్ లో ప్రీతిజింటా సైతం ప‌క్క దేశపు అబ్బాయికే ప‌డిపోయింది. ఇలా మ‌న ముద్దుగుమ్మ‌లంతా ప‌రాయి దేశాల‌కు కోడ‌ళ్లైపోతున్నారు.

User Comments