ఇంట‌ర్ పేప‌ర్లు కిలోల‌ లెక్క‌న అమ్మేసారా?

తెలంగాణ రాష్ట్రం ఇంట‌ర్ బోర్డ్ నిర్వాకంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. నాలుగైదు రోజుల నుంచి బోర్డు వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు  యాధావిధిగా కొన‌సాగుతున్నాయి. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ విద్యార్ధులు, సంఘాలు, ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌భుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. కేసీఆర్ ఐదేళ్ల పాల‌న‌లో ఎన్న‌డు లేని విధంగా కుంభం క‌దిలిపోయే స‌న్నివేశం ఎదురైంది. ఏ ప్ర‌శ్న‌కు ప్ర‌భుత్వం నుంచి స‌రైన స‌మాధానం రాలేదు. బోర్డు అధికారులు ముఖానికి క‌ర్చీపులు క‌ట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చిందంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. అటు ప్ర‌తిప‌క్షాలు ఇదే అదును కేసీఆర్ ప‌నితీరును ఎండ‌గ‌డుతున్నాయి. వాళ్ల‌కు విద్యార్ధులు కూడా తోడ‌వ్వ‌డంతో ఆందోళ‌న‌లు, విమ‌ర్శ‌లు మిన్నంటుతున్నాయి.

ఇక‌ నిన్నటి రోజున ముఖ్య‌మంత్రి బోర్డు అధికారుల‌తో అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేసి రీ వెరిఫికేష‌న్కు, కౌంటింగ్ ఎలాంటి రుసుము తీసుకోకుండా ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని తెలిపారు. అయితే అస‌లు త‌ప్పెక్క‌డ జ‌రిగి ఉంటుంద‌నే? సందేహాల నేప‌థ్యంలో అభ్య‌ర్ధుల వివ‌రాల‌ను కంప్యూట‌ర్ లోకి నిక్షిప్తం చేసే ముందే  త‌ప్పు జ‌రిగి ఉంటుంద‌ని? పేప‌ర్ వ్యాల్యుష‌న్ స‌వ్యంగానే జ‌రిగే ఉంటుంద‌ని కొంత మంది విద్యార్ధులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అలాగే మ‌రో సందేహం కూడా విద్యార్ధుల బుర్ర‌ల‌ను తొలిచేస్తోంది. అన్స‌ర్ పేప‌ర్ల‌ను ఇప్ప‌టికే కిలోల లెక్క‌న‌ స్క్రాప్ లో అమ్మేసి ఉంటార‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. అలా జ‌రిగితే పేప‌ర్ రీ వెరిఫికేష‌న్ ఎలా చేస్తారంటూ ప్ర‌శ్నిస్తున్నారు.  రీ వెరిఫికేష‌న్  ఓ భూట‌కం అని, పాస్ కి రెండు, మూడు మార్కులు తేడా ఉంటే పాస్ చేసి కొత్త డేటా ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని విద్యార్దులు చెప్పుకొస్తున్నారు. మరి దీనికి ఇంట‌ర్ బోర్డ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం.

Also Read : Kalki Locking Horns With Young Hero Film