విరాట ప‌ర్వానికి ఇంట‌ర్నేష‌న‌ల్ ట‌చ్

తెలుగు సినిమా స్థాయి..ఫ‌రిది రెండు మారాయి. దేశ‌, విదేశాల్లోనూ తెలుగు సినిమాల‌కు బాలీవుడ్ కు ధీటుగా రాణిస్తున్నాయి. బాహుబ‌లి, సైరా న‌ర‌సింహారెడ్డి ల‌ త‌ర్వాత తెలుగు సినిమా పాపులారిటీ ప్ర‌పంచ వ్యాప్త‌మైంది. తెలుగు సినిమా అంటే మార్కెట్లో ఓ బ్రాండ్ క్రియేట్ అయింది. టెక్నిక‌ల్ గాను టాలీవుడ్ ఎంతో వృద్దిలోకి వ‌చ్చింది. బ‌డ్జెట్ కు వెన‌క‌డుగు వేయ‌లేదు. క్వాలిటీ నిర్మాణం కోసం డ‌బ్బు మంచి నీళ్ల‌లా ఖ‌ర్చు చేస్తున్నారు. సినిమాపై నిర్మాత‌లు ఎంతో ఫ్యాష‌నేట్ గా ఉంటున్నారు. ఇప్ప‌టికే హాలీవుడ్ టెక్నిషియ‌న్లు బాలీవుడ్ లో విరివిగా పని చేస్తున్నారు. టాలీవుడ్ లోనూ ఆ పోక‌డ ఎక్కువ‌గానే ఉంది.

ఇప్ప‌టికే బాహుబ‌లి, సాహో కోసం హాలీవుడ్ టెక్నిషీయ‌న్లు ప‌నిచేసారు. ఇటీవ‌ల విడుద‌లైన సైరా కోసం లీ విట్టేక‌ర్, జార్జ్ పాల్ లాంటి స్టంట్ మాస్ట‌ర్ల చే కీల‌క యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. తాజాగా రానా క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న విరాట ప‌ర్వం కోసం మ‌రో అంత‌ర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ ని రంగంలోకి దింపుతున్న‌ట్లు టాక్. అత‌ని పేరు స్టీపేన్ రిచెట‌ర్. విరాట ప‌ర్వంలో అడ‌విలో జ‌రిగే కీల‌క‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నాడు. ఇందులో రానా, సాయి ప‌ల్ల‌వి న‌క్స‌లైట్ పాత్ర‌ల్లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సినిమాలో ఆ స‌న్నివేశాలు హైలైట్ గా ఉండాల‌నే స్టీపెన్ ని దింపుతున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో స్టీపెన్ చిచేట‌ర్ బిల్లా-2, బాలీవుడ్ లో ఉరీ చిత్రాల‌కు ప‌నిచేసాడు.