సాయి ధరమ్ తేజ్ బిజినెస్ బాగుంది.

Last Updated on by

ఈ వారం మూడు సినిమాలు వ‌చ్చాయి. అన్నీ క్రేజీ సినిమాలే. ప్ర‌తీ సినిమాపై అంచ‌నాలు.. ఆస‌క్తితో పాటు బిజినెస్ కూడా భారీగానే జ‌రిగింది. మ‌రీ ముఖ్యంగా రేంజ్ తో ప‌నిలేకుండా.. ట్రాక్ రికార్డ్ ప‌ట్టించుకోకుండా ఇంటిలిజెంట్ లాంటి సినిమాల‌కు హై రేంజ్ బిజినెస్ చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఫిబ్ర‌వ‌రి 9న ఇంటిలిజెంట్ విడుద‌లైంది. సాయిధ‌రంతేజ్ హీరోగా వినాయ‌క్ తెర‌కెక్కించిన ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. దానికి కార‌ణం వినాయ‌క్ అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ చిత్రానికి ముందు సాయికి వ‌ర‌స‌గా నాలుగు ఫ్లాపులు ఉన్నాయి. అలాంట‌ప్పుడు బిజినెస్ త‌క్కువ‌గా చేయాలి. కానీ వినాయ‌క్ బ్రాండ్ న‌మ్మేసి.. సినిమాను భారీరేట్ల‌కు అమ్మేసారు. ఫ‌లితంగా ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటేనే 28 కోట్లు తెచ్చుకోవాల్సిన ప‌రిస్థితి. ఇప్ప‌టి వ‌ర‌కు సాయిధ‌రంతేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సుప్రీమ్.. దానికే 24 కోట్లు వ‌చ్చాయి. ఇప్పుడు అంత‌కంటే 4 కోట్లు ఎక్కువ తెస్తే కానీ ధర్మాభాయ్ సేఫ్ అవ్వ‌లేడు.

ఇక తొలిప్రేమ‌కు కూడా బిజినెస్ భారీగానే జ‌రిగింది. వెంకీ అట్లూరి తెర‌కెక్కించిన ఈ చిత్రంపై వ‌రుణ్ తేజ్ చాలా ఆశ‌లే పెట్టుకున్నాడు. ఫిదా బ్లాక్ బ‌స్ట‌ర్ అయినా కూడా ఆ క్రెడిట్ అంతా సాయిప‌ల్ల‌వి ప‌ట్టుకెళ్లిపోవ‌డంతో త‌న‌కంటూ సొంత మార్క్ కోసం ట్రై చేస్తున్నాడు ఈ హీరో. ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మించ‌గా.. దిల్ రాజు విడుద‌ల చేస్తున్నాడు. 18 కోట్లు ప్ల‌స్ ఓవ‌ర్సీస్ అన్నీ క‌లిపి ఈ చిత్రాన్ని 24 కోట్ల‌కు అమ్మారు. ఫిదా 48 కోట్లు వ‌సూలు చేసినా కూడా ఇప్పుడు తొలిప్రేమ స‌క్సెస్ అయితేనే వ‌రుణ్ తేజ్ మార్కెట్ పెరిగిన‌ట్లు. ఇక గాయ‌త్రి కూడా మోహ‌న్ బాబు మార్కెట్ తో ప‌నిలేకుండా 12 కోట్ల‌కు అమ్మిన‌ట్లు తెలుస్తుంది. ఈ చిత్రం చాలా చోట్ల ఓన్ రిలీజ్ చేసుకున్నాడు క‌లెక్ష‌న్ కింగ్. అందుకే కాస్త అటూ ఇటూ అయినా కూడా మేనేజ్ చేసేయొచ్చు. మొత్తానికి ఈ మూడు సినిమాలు హిట్ అవ్వాలంటే క‌నీసం 80 కోట్లు రావాల్సిందే.

User Comments