డార్లింగ్ గుండెల్లో చంద‌మామ ఇంకా?!

Last Updated on by

డార్లింగ్ ప్ర‌భాస్ .. చంద‌మామ కాజ‌ల్ ల‌వ్ స్టోరి గురించి తెలిసిందే. ఆ ఇద్ద‌రూ క‌లిసి రెండు సినిమాల్లో న‌టించారు. డార్లింగ్, మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ చిత్రాల్లో జోడీగా న‌టించారు. ఆ స‌మ‌యంలోనే ప్ర‌భాస్ – కాజ‌ల్ ఒక‌రినొక‌రు ప్రేమించుకున్నార‌ని, విడిపోలేనంత డీప్ ప్రేమ‌లో కూరుకుపోయార‌ని ప్ర‌చార‌మైంది. అయితే ఆ క్ర‌మంలోనే ప్ర‌భాస్, కాజ‌ల్ మ‌ధ్య బ్రేక‌ప్ గురించి ముచ్చ‌ట సాగింది.

అటుపై ఆ ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు దూర‌మ‌య్యారు ఎందుక‌నో. కాజ‌ల్ తెలుగు సినిమాల్ని త‌గ్గించుకుని అటు త‌మిళంలో స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రిచింది. ఆ స‌మ‌యంలో కాజ‌ల్ లోని నిర్వేదం గురించి తెలిసిందే. త‌న సిస్ట‌ర్ నిషా అగ‌ర్వాల్ పెళ్లి చేసుకుని సెటిలైనా కాజ‌ల్ ఇప్ప‌టికీ పెళ్లి అంటే విముఖ‌త క‌న‌బ‌రుస్తున్నార‌న్న చ‌ర్చా సాగుతోంది. అదంతా అటుంచితే అందాల చంద‌మామ కాజ‌ల్ తిరిగి డార్లింగ్ స‌ర‌స‌న న‌టించ‌బోతోంద‌న్న ప్ర‌చారం వేడెక్కిస్తోంది. అయితే సోలో నాయిక‌గా కాదు. ప్ర‌భాస్ 20 లో కాజ‌ల్ ఓ కీల‌క పాత్ర పోషిస్తోంద‌ట‌. జాన్ అనే టైటిల్ వినిపిస్తున్నా ఇంకా ఈ చిత్రానికి టైటిల్ ని ఖాయం చేయాల్సి ఉంది. ఇందులో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ప్ర‌భాస్ ఖ‌రీదైన కార్ల వ‌ర్త‌కుడిగా క‌నిపించ‌నున్నాడు. ఇక ఈ క‌థ‌లో చంద‌మామ కాజ‌ల్ రంగ ప్ర‌వేశం చేస్తోంది అంటే త‌న పాత్రకు ఉన్న ప్రాధాన్య‌త‌పైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అయితే బ్రేక‌ప్ అయిన త‌ర్వాత ప‌దేళ్ల‌కు కాజ‌ల్ ఇలా తిరిగి ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించేందుకు రెడీ అవుతుండ‌డంతో మ‌రోసారి యువ‌త‌రం లో దీనిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

User Comments