మెగా బ‌ర్త్ డే `సైరా` ప్ర‌చార వేదిక‌నా

మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా నేటి సాయంత్రం హైద‌రాబాద్ శిల్ప‌క‌ళా వేదిక‌లో భారీ ఈవెంట్ నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారు. దీంతో వేదిక వ‌ద్ద‌కు భారీగా మెగాస్టార్- ప‌వ‌న్ ఫ్యాన్స్ తో సంద‌డి సంద‌డిగా క‌నిపిస్తోంది. క్రేజీగా మెగాస్టార్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ లో పాల్గొనేందుకు ఏపీ-తెలంగాణ‌లోని అన్ని ఏరియాల నుంచి భారీగా ఫ్యాన్స్ విచ్చేశారు. ఈవెంట్ వేదిక‌పై మెగా స్టార్ సాంగ్స్ మెడ్లీలు.. రీమిక్స్ లతో ఒక‌టే హడావుడి సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఈవెంట్ కి ఎవ‌రూ ప్ర‌త్యేకించి అతిధులు ఇంకా రాలేదు. శిల్ప‌క‌ళా వేదిక ఆడిటోరియం సాయంత్రం ఓపెన్ కాగానే లోనికి మెగా ఫ్యాన్స్ స‌ర్రున దూసుకెళుతున్న వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.