ఈసారైనా జేజ‌మ్మ కార్య‌రూపం దాల్చేనా?

ప‌దేళ్ల క్రితం వ‌చ్చిన `అరుంధ‌తి` అనుష్క‌ని స్టార్ క‌థానాయిక‌ల జాబితాలో చ‌ర్చింది. శ్యామ్ ప్ర‌సాద‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అనుష్క మ‌హిళా ప్ర‌ధాన‌ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచింది. దీంతో ఆమెని ప్ర‌ధానంగా చేసుకుని ద‌ర్శ‌కులు, క‌చ‌యిత‌లు కొత్త క‌థ‌లు రాసుకున్నారు. అప్ప‌ట్లో బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నం సృష్టించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయాల‌ని ఓ బ‌డా నిర్మాత రీమేక్ హ‌క్కుల్ని కూడా సొంతం చేసుకున్నారు కానీ ఏ క‌థానాయికా ముందుకు రాక‌పోవ‌డంతో `అరంధ‌తి` రీమేక్ ఆలోచ‌న కార్య‌రూపం దాల్చ‌లేదు.

`బాహుబ‌లి` సినిమా భార‌తీయ సినీ మార్కెట్‌ని విస్త‌రించ‌డం, ప్రేక్ష‌కుల అభిరుచిలో మార్పులు రావ‌డంతో `అరుంధ‌తి` రీమేక్ ఆలోచ‌న మరోసారి తెర‌మీదికొచ్చింది. అయితే ఈ ద‌ఫా ఎలాగైనా తెర‌పైకి తీసుకురావాల‌ని ఇద్ద‌రు నిర్మాత‌లు గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తున్నారు. ద‌క్షిణాది చిత్రాల‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్ప‌డ‌టంతో `అరంధ‌తి` రీమేక్‌కు ఇదే స‌రైన స‌మ‌యంగా భావించిన నిర్మాత‌లు భారీ హంగుల‌తో ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. ఇందులోని కీల‌కమైన జేజ‌మ్మ పాత్ర కోసం క‌రీనాక‌పూర్‌ని మేక‌ర్స్ సంప్ర‌దించార‌ని తెలిసింది. అయితే వ‌రుస క‌మిట్‌మెంట్‌ల‌తో బిజీగా వున్న క‌రీనా ఈ చిత్రంలో న‌టించే అవ‌కాశం లేద‌ని, ఆమె స్థానంలో అనుష్క శ‌ర్మ‌ని తీసుకోవాల‌ని మేక‌ర్స్ ఓ ఆలోచ‌న‌కు వ‌చ్చిన‌ట్టే ముంబాయి మీడియా స‌మాచారం.