ప‌వ‌న్ కోసం పూరి కూడా క‌థ చేశాడా?

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌స్తున్నాడ‌ని తెలియ‌డంతో ద‌ర్శ‌కుల్లో ఉత్సాహం క‌ట్ట‌లు తెంచుకుంది. ఆయ‌న కోసం చాలామందే క‌థ‌లు సిద్ధం చేసుకుంటున్నారు. ప‌వ‌న్ కూడా రాజకీయాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ… విరామం లేకుండా వ‌రుస‌గా సినిమాలు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. `పింక్‌` రీమేక్‌తో పాటు… క్రిష్ సినిమాకి కూడా పచ్చ‌జెండా ఊపాడు, ఆ రెండింటినీ దాదాపుగా స‌మాంత‌రంగా పూర్తి చేయ‌బోతుండ‌డం మ‌రో విశేషం. ఈ నెల 27న ప‌వ‌న్ – క్రిష్ సినిమా మొదలు కాబోతోంది. ఇదంతా ఒకెత్తైతే..

తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ – పూరి జ‌గ‌న్నాథ్ మ‌ధ్య కూడా చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్టు వార్త‌లు రావ‌డం మ‌రో ఎత్తు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ కాంబినేష‌న్లో సినిమా చేయాల‌ని భావిస్తోంది. ప‌వ‌న్‌కి మైత్రీ ఎప్పుడో అడ్వాన్సు ఇచ్చింది. అందుకే ఆ ఇద్ద‌రినీ క‌లిపింద‌ట‌. పూరి చెప్పిన క‌థ విని ప‌వ‌న్ కూడా ఇంప్రెస్ అయ్యాడ‌ని, తప్ప‌కుండా చేద్దామ‌ని మాట ఇచ్చార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం పూరి ముంబైలో ఫైట‌ర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆయ‌న రంగంలోకి దిగారంటే మెరుపు వేగంతో సినిమాల్ని పూర్తి చేస్తాడు. ఇక అది పూర్త‌య్యేలోపే ప‌వ‌న్ చేస్తున్న సినిమాలు కూడా ఒక కొలిక్కి రావ‌చ్చు. సో… ఈ కాంబోలో సినిమా వ‌చ్చే యేడాది ఉండొచ్చ‌ని ప్రచారం సాగుతోంది. `కెమెరామెన్ గంగ‌తో రాంబాబు` త‌ర్వాత ప‌వ‌న్ – పూరి క‌లిసి చేస్తున్న సినిమా ఇదే.