రౌడీ-పూరి క‌థ‌లో అంత ట్విస్టుందా?

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో పూరి కనెక్ట్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం క‌థ ఏమై ఉంటుంది?  గ‌త కొంత‌కాలంగా టీటౌన్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఇది. ఇప్ప‌టికే పూరి ఫైట‌ర్ అనే టైటిల్ ని ఫైన‌ల్ చేశాడ‌ని.. ఇందులో విజ‌య్ బాక్సార్ గా ఫైట‌ర్ గా క‌నిపిస్తాడ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అయితే అంత‌కుమించి క‌థ‌లో ఇంకేమీ లేదా? అంటే ఓ టాప్ సీక్రెట్ రివీలైంది.

ఈ క‌థ‌లో అస‌లైన ట్విస్టు న‌త్తితో బాధ‌ప‌డే మాఫియా వార‌సుడు ఎలా గెటిన్ అయ్యాడు? అన్న‌ది క‌థాంశం అని తెలుస్తోంది. ఆ న‌త్తిని హీరో ఎలా ఓవ‌ర్ కం అయ్యాడు? ఎలా త‌న తండ్రి నేర సామ్రాజ్యానికి అధిప‌తి అయ్యాడు? అన్న‌ది పూరీ మార్కు క‌థ అట‌. ఈ క‌థ‌లో ట్విస్టు న‌చ్చ‌డం వ‌ల్ల‌నే ఎంతో సెల‌క్టివ్ గా ఉండే దేవ‌ర‌కొండ అంగీక‌రించాడ‌ట‌.

ఈ సినిమాలో న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ లేదా విక్ట‌రీ వెంక‌టేష్ ల‌లో ఎవ‌రో ఒక‌రు కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు పూరి ఆ ఇద్ద‌రితో మంత‌నాలు సాగిస్తున్నార‌ని ఎవ‌రో ఒక‌రిని ఫైన‌ల్ చేసే ప‌నిలో ఉన్నార‌న్న మాటా వేడెక్కిస్తోంది. మొత్తానికి పూరి భాయ్ చాలానే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంక‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన త‌ర్వాత అత‌డి మైండ్ మ‌రింత స్మార్ట్ గా షార్ప్ గా ప‌ని చేస్తోంద‌ని దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. దేవ‌ర‌కొండ త‌ర్వాత ప్ర‌భాస్ ని లైన్ లో పెట్టాల‌న్న ఆలోచ‌న కూడా దిమ్మ తిరిగేలా లేదూ?