వెంకీ మామ‌ సంక్రాంతికి కాదా?

Venky Mama - File Photo

మామ‌- అల్లుడు సంక్రాంతికి రారా? అంటే అవున‌నే వినిపిస్తోంది. విక్ట‌రీ వెంక‌టేష్-నాగ‌చైత‌న్య‌లు క‌థానాయ‌కులుగా బాబి ద‌ర్శ‌క‌త్వంలో వెంకీమామ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. తొలిసారి మామ‌-అల్లుడు క‌లిసి న‌టిస్తోన్న చిత్రం కావ‌డంతో సినిమా పై భారీ అంచ‌నాలున్నాయి. వెంకీ కున్న‌ లేడీ ఫాలోయింగ్.. యువ‌త‌లో చైకున్న ఫాలోయింగ్ నేప‌థ్యంలో మామ‌-అల్లుడు బాక్సాఫీస్ వ‌ద్ద మేజిక్ చేస్తార‌నే ఎక్స్ ప‌క్టేష‌న్స్ పీక్స్ లోనే ఉన్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన పోస్ట‌ర్స్, టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీ అయింది.

తాజాగా దీపావ‌ళి సంద‌ర్భంగా వెంకీ మామ కొత్త పోస్ట‌ర్ల‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసారు. చై ఆర్మీ గెట‌ప్ లో..వెంకీ క్యాజువ‌ల్ లుక్ లో సీరియ‌స్ గా క‌నిపిస్తున్నారు. అయితే పోస్ట‌ర్ల‌లో మాత్రం రిలీజ్ డేట్ ను రివీల్ చేయ‌లేదు. దీంతో మ‌రోసారి మామ‌-అల్లుడు రిలీజ్ స‌స్పెన్స్ లో ప‌డింది. వాస్త‌వానికి సినిమా రిలీజ్ తేదీని ఇప్ప‌టివ‌ర‌కూ అధికారంగా ప్ర‌క‌టించ లేదు. సోష‌ల్ మీడియాలో ఊహాగానాలు మాత్ర‌మే వ‌చ్చాయి. ఇప్ప‌టికే న‌వంబ‌ర్, డిసెంబ‌ర్, జ‌న‌వ‌రి నెల్ల‌లోలో కొన్ని సినిమాలు రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్నాయి.

కానీ వెంకీ మామ ఈ జాబితాలో లేదు. ఇద్ద‌రు బిగ్ స్టార్లు న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో సంక్రాంతికి రిలీజ్ చేసే అవ‌కాశం ఉంద‌ని సోర్సెన్ నుంచి వినిపించింది. అభిమానులు ఆ ధీమాతోనే ఉన్నారు. కానీ యూనిట్ మౌనాన్ని బ‌ట్టి సంక్రాంతి కూడా మామ‌-అల్లుళ్లు ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం క‌ష్ట‌మేన‌ని తెలుస్తోంది. మ‌రి రిలీజ్ డేట్ రివీల్ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో జాప్మమా? ల‌ఏక‌ మ‌రేమైనా కార‌ణాలు ఉన్నాయా? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రడ‌క్ష‌న్స్-పీపూల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.