ఇషా స్టార్ అయిన‌ట్టే

Last Updated on by

తెలుగ‌మ్మాయిల‌కు తెలుగు డైరెక్ట‌ర్లు, నిర్మాత‌లు అవ‌కాశాలు ఇవ్వ‌ర‌న్న అపప్ర‌ద ఉన్న సంగ‌తి తెలిసిందే. తెలుగ‌మ్మాయిలు అంటే మ‌న ద‌ర్శ‌కుల్లో చుల‌క‌న భావం ఉంటుంది. పైగా ముంబై క్యాట్ వాక్ భామ‌ల్లో ఉన్నన్ని హొయ‌లు, గ్లామ‌ర్ ఎలివేష‌న్‌ వీళ్ల వ‌ల్ల కాద‌ని భావిస్తారు. ఆ క్ర‌మంలోనే తెలుగు భామ‌ల్లో ట్యాలెంటు ఉన్నా అక్క‌, చెల్లి, ఆంటీ పాత్ర‌ల‌కే ప‌రిమితం కావాల్సొస్తోంది.

అయితే ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. అడ‌పాద‌డ‌పా తెలుగ‌మ్మాయిలు క‌థానాయిక‌లు పెద్ద స్థాయి అవ‌కాశాలు అందుకుంటున్నారు. ఇటీవ‌లే ఎన్టీఆర్ `అర‌వింద స‌మేత‌`లో తెలుగ‌మ్మాయి ఇషారెబ్బా అవ‌కాశం అందుకోవ‌డంతో అంతా షాక‌య్యారు. అంత పెద్ద స్టార్ హీరో స‌ర‌స‌న తెలుగ‌మ్మాయికి అవ‌కాశం వ‌చ్చిందా? అంటూ స‌ర్‌ప్రైజ్ అయ్యారు. ఆ క్ర‌మంలోనే నిన్న‌టిరోజున `బ్రాండ్ బాబు` టీజ‌ర్ వేడుక‌లో ఊహించ‌ని ప్ర‌శంస‌ను అందుకుంది ఇషా. ఎన్టీఆర్ `అర‌వింద స‌మేత‌`లో అదిరిపోయే రోల్ చేస్తోంది ఇషా అని హ‌రీష్ శంక‌ర్ కితాబిచ్చారు. ఇషా ఇక స్టార్ హీరోయిన్ అయిపోయిన‌ట్టేన‌ని అన్నారు. ఇంత‌కీ ఇషా ఎన్టీఆర్ స‌ర‌స‌న ఎలాంటి పాత్ర‌లో చేస్తోంది? నిజంగానే తెలుగమ్మాయికి అంత పెద్ద ఆఫ‌ర్ ఇచ్చారా? అంటూ మాట్లాడుకోవ‌డం విశేషం. టాలీవుడ్‌లో తెలుగ‌మ్మాయిల‌కు చోటు లేదు అని అంటారు.. ఈసారి ట్రెండ్ మారుతోందా? అంటూ ఒక‌టే ముచ్చ‌ట సాగింది. ఇంత‌కీ ఇషా స్టార్ హీరోయిన్ అయిన‌ట్టేనా? అంటే కోటి పారితోషికం క్ల‌బ్‌లో చేరుతోందా? `అర‌వింద స‌మేత` రిలీజ్ వ‌ర‌కూ.. ఇదో స‌స్పెన్స్‌.

User Comments