పూరితో గోవాలో ఎంజాయ్ చేస్తోంది

ఇస్మార్ట్ శంక‌ర్` సినిమాతో భారీ హిట్‌ని ఖాతాలో వేసుకుంది నిధి అగర్వాల్‌. అంత‌కు ముందు అక్కినేని హీరోల‌తో రెండు చిత్రాల్లో న‌టించినా రాని గుర్తింపు, పాపులారిటీ `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో వ‌చ్చేసింది. ఆ స్థాయిలో నిధి అందాల‌ని తెర‌పై మ‌రింత అందంగా చూపించి ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ కుర్ర‌కారుకి మ‌తిపోగొట్టారు. దీంతో త‌న‌కు భారీ హిట్‌ని అందించి త‌న కెరీర్‌ని స్పీడ‌ప్ చేసిన పూరిజ‌గ‌న్నాథ్‌, హీరోయిన్ క‌మ్ నిర్మాత చార్మీ అంటే నిధి అగ‌ర్వాల్ కు ఎఫెక్ష‌న్ ఏర్ప‌డింది.

అక్క‌డి నుంచి వారు ఎక్క‌డికి వెళ్లినా వారిని అనుస‌రించ‌డం మొద‌లుపెట్టింది. `ఇస్మార్ట్ శంక‌ర్` చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనే పూరీ, చార్మీల‌కు బాగా ద‌గ్గ‌రైన నిధి ఆ త‌రువాత నుంచి వారు ఎక్క‌డికి వెళితే అక్క‌డికి వారి కూడా వెళ్ల‌డం మొద‌లుపెట్టింది. తాజాగా పూరి, చార్మి గోవా ట్రిప్‌కు వెళ్లారు. అక్క‌డికి వెళ్లిన నిధి అగ‌ర్వాల్ గోవా అందాల‌ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేసింద‌ట‌. ఈ ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

గోవా ట్రిప్‌కు సంబంధించిన ఫొటోల్ని పోస్ట్ చేసి నిధి పెట్టిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది. `నా ఫేవ‌రేట్స్ పూరిజ‌గ‌న్నాథ్‌, చార్మి. వాళ్ల‌తో గోవాలో హాఫ్ డే గ‌డిపా. చాలా ఆనందంగా వుంది. అని పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌తో పాటు పూరి, చార్మిల‌తో క‌లిసి నిధి స్క‌ర్ట్‌లో దిగిన ఫొటో నెట్టింట వైర‌ల్‌గా మారింది. నిధి ఎంతైనా అందగ‌త్తె అంటూ నెటిజ‌న్స్ కామెంట్‌లు చేస్తున్నారు.