ఇస్మార్ట్ శంక‌ర్ మూవీ రివ్యూ

iSmart Shankar Live Review

నటీనటులు : రామ్, నిధి అగ‌ర్వాల్, న‌భా న‌టేష్ త‌దిత‌రులు..
బ్యానర్: పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌- పూరి క‌నెక్ట్స్
నిర్మాత: పూరి జ‌గ‌న్నాథ్- ఛార్మి
సంగీతం: మ‌ణిశ‌ర్మ‌
రచన- దర్శకత్వం: పూరి జ‌గ‌న్నాథ్

ముందు మాట:

కొన్ని వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత రామ్ .. ఫ్లాపుల్లోనే ఉన్న‌ పూరీని నమ్మి `ఇస్మార్ట్ శంక‌ర్` చిత్రంలో న‌టించాడు. ఈ సినిమాలో త‌న గెట‌ప్ .. క‌థ‌లో గ‌మ్మ‌త్త‌యిన మ్యాట‌ర్ ఉంద‌ని అందుకే అంగీక‌రించాన‌ని రామ్‌ ప్పారు. శంక‌ర్ పాత్ర‌లో న‌టించాక కిక్కొచ్చింద‌ని ఇన్నాళ్లు లేనిది ఏదో దొరికింద‌ని రామ్ ఇంట‌ర్వ్యూల్లో అన‌డం ఆస‌క్తిని పెంచింది. మెమ‌రీ చిప్ .. సిమ్ కార్డ్ ఈ సినిమా క‌థ‌లో కీ రోల్ ప్లే చేయ‌నుంద‌ని టీజ‌ర్-ట్రైల‌ర్ చూశాక అర్థ‌మైంది. రామ్ రూపం.. నైజాం యాస‌.. క‌ల్చ‌ర్ ప్ర‌తిదీ మాస్ లో చ‌ర్చ‌కు వ‌చ్చాయి. నేడు ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజైంది. అయితే ఇస్మార్ట్ శంక‌ర్ స‌క్సెస్ పై పూరి- రామ్- చార్మి ల కాన్ఫిడెన్స్ నిజ‌మైందా లేదా? అంత మ్యాట‌ర్ ఈ సినిమాలో ఉందా లేదా? అన్న‌ది తెలియాలంటే ఈ రివ్యూ చ‌ద‌వాల్సిందే..

కథనం అనాలిసిస్:
హైద‌రాబాదీ మాస్ కుర్రాడు ఉస్తాద్ శంక‌ర్ (రామ్) బుర్ర‌లోకి ఓ మెమ‌రీ చిప్ ని అమ‌రుస్తాడు సీబీఐ అధికారు స‌త్య‌దేవ్ (స‌త్య‌దేవ్). శ‌స్త్ర చికిత్స చేసి ఆ చిప్ ని అమ‌ర్చిన క్ర‌మంలోనే మెద‌డుపై ప‌రిశోధ‌కురాలిగా నిధి ప‌రిచ‌యం అవుతుంది. బ్రెయిన్ లో జ్ఞాప‌క క‌ణాలు(న్యూరాన్లు) ఎలా ప‌ని చేస్తున్నాయి? అన్న‌ది ప‌రిశోధించే సైంటిస్టుగా నిధి ఎంట్రీ ఇస్తుంది. ఆస‌క్తిక‌రంగా ఆ మెమరీ చిప్ ద్వారా శంక‌ర్ బుర్ర‌లోకి వేరొక వ్య‌క్తి జ్ఞాప‌కాల్ని పంప‌డం ఆస‌క్తిక‌ర ఎలిమెంట్. అయితే దాని ప‌ర్య‌వ‌సాసం ఏమిటి? అస‌లు అత‌డి మెద‌డులోకి చిప్ ని వేరొక వ్యక్తి జ్ఞాప‌కాల్ని ఎందుకు పంపించారు? ఈ క‌థ‌లో విల‌న్ గ్యాంగ్ ఏం చేసింది? సీబీఐ టార్గెట్ ఏంటి? ఇద్ద‌రు భామ‌ల‌తో రామ్ రొమాన్స్ ఎలా సాగింది? వ‌గైరా వ‌గైరా తెర‌పైనే చూడాలి.

ఈ క‌థ తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ఓ ప్ర‌యోగం అనే చెప్పాలి. రామ్ చ‌ర‌ణ్ – బ‌న్ని న‌టించిన‌ `ఎవ‌డు` (వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కుడు) త‌ర‌హాలోనే ఇదో ప్ర‌యోగాత్మ‌క క‌థాంశం. ఈ సినిమాకి హాలీవుడ్ సినిమాల ప్రేర‌ణ బ‌లంగా ప‌ని చేసింది. ఓ ర‌కంగా ఇది హాలీవుడ్ లో వ‌చ్చిన `ది క్రిమిన‌ల్` అనే సినిమా క‌థాంశాన్ని పోలి ఉందన‌డంలో సందేహ‌మేం లేదు. అయితే ఇంత ఇంట్రెస్టింగ్ స్టోరీని పూరి ఎలివేట్ చేసిన విధానం ఆడియెన్ కి న‌చ్చిందా? అంటే .. అతుకుల బొంత క‌థ‌నంలో గ‌జిబిజి న‌డ‌క ఏమాత్రం రుచించ‌దు. మెద‌డులో జ్ఞాప‌కాల్ని మార్చ‌డం అన్న పాయింట్ ఎంతో బ‌ల‌మైన‌ది. అందుకు త‌గ్గ‌ట్టు సీన్ల‌ను రాసుకోవ‌డంలో పూరి టీమ్ పూర్తిగా త‌డ‌బ‌డ్డార‌నే చెప్పాలి. ఈసారి ఎందుకో పూరి త‌న మార్క్ టేకింగ్ ని మిస్స‌య్యాడ‌ని అనిపించ‌క మాన‌దు. ఇక రొటీన్ పోలీస్ క‌థ‌లు.. మాఫియా క‌థ‌ల‌తో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. వాటి త‌ర‌హాలోనే సాగే వేరొక సినిమా ఇద‌ని అర్థ‌మ‌వుతుంది. అంతేకాదు ముందు ఏం జ‌ర‌గ‌బోతోంది? అన్న‌ది ముందే ఊహించేయ‌గ‌ల‌గ‌డం.. క్లైమాక్స్ ను సైతం ఊహించేసేంత సింపుల్ గా తీర్చిదిద్ద‌డంతోనే సినిమా పూర్తిగా తేలిపోయింది. ఈ సినిమాలో రామ్ పాత్ర‌ను మ‌లిచిన తీరు .. రామ్ మేకోవ‌ర్ ప్ర‌తిదీ క‌ట్టి ప‌డేస్తాయి. అయితే ఫ్లాస్ బ్యాక్ లు మార్చి గోవా బ్యాక్ డ్రాప్ కి వెళ్లినా.. హీరోయిన్ మ‌ర్డ‌ర్ అయినా .. ఈ క‌థ‌లో ఎక్క‌డా కొత్త‌గా ఆస‌క్తి రేకెత్తించే పాయింట్ క‌నిపించ‌దు.

నటీనటులు:
రామ్ ఓ ర‌కంగా హైదరాబాదీ మాస్ గ‌య్ పాత్ర‌లో రఫ్ అండ్ రగ్గడ్ లుక్ .. తెలంగాణా యాసతో వన్ మేన్ షో చూపించాడ‌న‌డంలో సందేహ‌మేం లేదు. ప‌తాక స‌న్నివేశాల్లో ఆరుప‌ల‌క‌ల్ని చూపించి అద‌ర‌గొట్టాడు. ఇక అందాల భామ‌లు నిధి అగర్వాల్ .. నభా నటేష్ లు గ్లామ‌ర్ కంటెంట్ తో యూత్ గుండెల్ని బ‌రువెక్కించార‌నే చెప్పాలి. స‌త్య‌దేవ్ పాత్ర‌ను పూరి తీర్చిదిద్దిన విధానం బావుంది. అందుకు త‌గ్గ‌ట్టే అత‌డు న‌టించి మెప్పించాడు. సాయాజీ షిండే సినిమా చివరి వరకు సపోర్టింగ్ పాత్ర‌లో ఆకట్టుకుంటారు.

టెక్నికాలిటీస్:
రాజ్ తోట సినిమాటోగ్రఫీ అసెట్‌. మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతం. దాంతో పాటు ఓ రెండు పాటలు పర్వాలేదనిపించాయి. ఇత‌ర విభాగాలు ఓకే.

ప్లస్ పాయింట్స్:

* ఎంచుకున్న క‌థాంశం
* రామ్ యూనిక్ స్టైల్ .. ఎన‌ర్జిటిక్ పెర్ఫామెన్స్
* నిధి, న‌భ న‌ట‌న ప్ల‌స్

మైనస్ పాయింట్స్:

* క‌థ‌నంలో బిగి లేక‌పోవ‌డం.. ముందే ఊహించ‌గలిగే సీన్లు
* గంద‌ర‌గోళ స‌న్నివేశాలు

ముగింపు:
ఇస్మార్ట్ రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ బిలో యావ‌రేజ్ డ్రామా

రేటింగ్:
2.75/5