ఇస్మార్ట్ శంక‌ర్ రీ రిలీజ్

Ismart Shankar re-release

రామ్ కథానాయ‌కుడిగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఇస్మార్ట్ శంక‌ర్ ఇటీవ‌ల విడుద‌లై పెద్ద విజ‌యం సాధించిన సంగతి తెలిసిందే. డ‌బుల్ దిమాక్ అంటూ రామ్ మాస్ న‌ట‌న‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి విశేష స్పంద‌న ల‌భించింది. మ్యూజిక‌ల్ గాను పెద్ద హిట్టు అయింది. తాజాగా ఈ సినిమా పూరి పుట్టిన రోజు (సెప్టెంబ‌ర్ -28) సంద‌ర్భంగా మ‌ళ్లీ విడుద‌ల చేస్తున్నారు.

ఏపీ తెలంగాణ రాష్ర్టాల్లో ఐదేసి చొప్పున మొత్తం ప‌ది థియేట‌ర్ల‌లో ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. ఆవిష‌యాన్ని చిత్ర నిర్మాత‌ల‌లో ఒక‌రైన ఛార్మీ ప్ర‌క‌టించింది. రాజ‌మండ్రిలో- ఊర్వ‌శి, కాకినాడ‌లో -దేవి, తిర‌ప‌తిలో- విఖ్యాత్, గుంటూరులో-స్వామి, వైజాగ్- గోకుల్ థియేట‌ర్ల‌ల‌లో, దిలుషుక్ న‌గ‌ర్- వెంక‌టాద్రి, వ‌రంగ‌ల్-ల‌క్ష్మ‌ణ్, క‌రీంన‌గ‌ర్- తిరుమ‌ల‌, ఖ‌మ్మం-ఆదిత్య‌, కాజీపేట‌-భ‌వానీ థియేట‌ర్ల‌ల‌లో చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌స్తుతం యూ ట్యూబ్ లో పాట‌లు సంద‌డి చేస్తున్నాయి.