ఎనర్జిటిక్ స్టార్ రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `ఇస్మార్ట్ శంకర్` లో రామ్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో? ఫస్టు లుక్ పోస్టర్ తోనే ఓ అంచనాకి వచ్చేసారు. ఇప్పుడా ఆ అంచనాలను టీజర్ వేదికగా అంతకంతకు రెట్టింపు చేసాడు పూరి. నేడు రామ్ పుట్టిన రోజు సందర్భంగా టీజన్ ను రిలీజ్ చేసారు. టీజర్ ఎలా ఉందో? ఓ సారి చూద్దాం.
టీజర్ లో రామ్ మాసియిజం కొట్టొచ్చినట్లుంది. మునుపెన్నడు చూడని సరికొత్త రామ్ ని చూపించాడు. పతా హై మై కౌన్ హూ.. శంకర్.. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అంటూ తని ఇంటర్ డ్యూస్ చేసుకునే విధానం ఆసక్తికరంగా ఉంది. నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడి ముంగట పొట్టేలుని కట్టేసినట్లే అంటూ పూరి మార్క్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. రామ్ పాత్రను పక్కా తెలంగాణ బేస్డ్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ యాస, భాష అన్నీ తెలంగాణ ఊర మాస్ లెక్క అనిపిస్తోంది. రామ్ లుక్… నోట్లో సిగరెట్టు ..టీజర్ మేకింగ్ చూస్తుంటే కళ్యాణ్ రామ్ ఇజం గుర్తొస్తుంది. ఒకే టీజర్ లో పాట, ఫైట్, డాన్స్ అన్నింటిని కలగలిపి కట్ చేసారు. మణిశర్మ ఆర్ ఆర్ కొత్తగా ఏమీ అనిపించలేదు. మరి ఆన్ స్ర్కీన్ పై ఇస్మార్ట్ గా ఉంటాడో లేదో? చూద్దాం. ప్రస్తుతం గోవాలో పాటల షూటింగ్ జరుగుతోంది. మరో మూడు పాటలు మినహా షూటింగ్ పూర్తయినట్లే. జూన్ చివరి వారంలోగానీ, జులైలో గాని చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.