డి.సురేష్ బాబుపై ఐటి ఎటాక్స్

Suresh Babu

టాలీవుడ్ అగ్ర నిర్మాత, రామానాయుడు స్టూడియోస్ – సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత డి.సురేష్ బాబుపై ఐటీ ఎటాక్స్ హాట్ టాపిక్ గా మారింది. బుధ‌వారం ఉద‌యం నుంచి రామానాయుడు స్టూడియోస్ స‌హా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ కార్యాల‌యాల్లో ఐటీ సోదాలు సాగుతున్నాయి. ఏక‌కాలంలో సురేష్ బాబు ఇల్లు, కార్యాల‌యాల‌తో పాటు ఆయ‌న స‌న్నిహితుల కార్యాల‌యాలు ఇళ్ల‌పైనా ఈ దాడులు నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ లోని సురేష్ బాబు ఇల్లు.. రానా ఇంటిపైనా ఐటీ దాడులు సాగాయ‌ని స‌మాచారం అందుతోంది.

గ‌త కొంత‌కాలంగా ఐటీ చెల్లింపుల్లో స‌రైన ప్రూఫ్ లు లేనందున ఈ దాడులు నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌లు డాక్యుమెంట్లు స‌హా హార్డ్ డిస్కుల్ని ఐటీ శాఖ అధికారులు స్వాధీన‌ప‌ర్చుకున్నారు. మ‌రింత లోతుగా ఈ దాడులు కొన‌సాగ‌నున్నాయ‌ని తెలుస్తోంది. సురేష్ బాబు ఇటీవ‌లి కాలంలో సినిమాల నిర్మాణం త‌గ్గించారు. కేవ‌లం భాగ‌స్వాముల‌కు ప్ర‌చార సాయం అందిస్తూ వారితో సినిమాల్ని నిర్మిస్తున్నారు త‌ప్ప నేరుగా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సోలోగా సినిమాలు తీస్తున్న‌ది లేదు. అందుకే ఐటీ అధికారులు సురేష్ బాబుతో అసోసియేట్ అయిన భాగ‌స్వాముల కార్యాల‌యాల‌పైనా దాడులు నిర్వ‌హిస్తున్నార‌ని తెలుస్తోంది. ప‌రిశ్ర‌మలో ఆ న‌లుగురిలో ఒక‌డిగా పాపుల‌రైన సురేష్ బాబు నిర్మాత‌ల మండ‌లి నుంచి ఎల్.ఎల్.పి కం నిర్మాతల గిల్డ్ ని స‌ప‌రేట్ చేయ‌డంలో కీల‌క భాగ‌స్వామి అన్న సంగ‌తి తెలిసిందే. సినిమాల నిర్మాణం కంటే ఎగ్జిబిష‌న్.. పంపిణీ రంగంలో భారీ ఆదాయాలు క‌ళ్ల జూస్తున్న గ్రేట్ బిబినెస్ మ్యాన్ గా ఆయ‌న ఐటీ దృష్టిలో ఉన్నార‌ని అందుకే ఈ దాడులు సోదాలు అని విశ్లేషిస్తున్నారు.