వెంకీ..నాగ్‌..నానిపై ఐటీ ఎటాక్స్

ఉన్న‌ట్టుండి టాలీవుడ్ ఉలిక్కిప‌డింది. వ‌రుస పెట్టి హీరోలు నిర్మాత‌ల‌పై ఐటీ అధికారులు దాడులు చేయ‌డం ప్ర‌కంప‌నాల‌కు కార‌ణ‌మైంది. బుధ‌వారం ఉద‌యం రామానాయుడు స్టూడియోస్- డి.సురేష్ బాబు కార్యాల‌యాల్లో ఐటీ సోదాలు జ‌రిగాయ‌ని వార్త అందింది.

ఆ త‌ర్వాత ఆ టాక్ అంత‌టా విస్త‌రించింది. విక్ట‌రీ వెంక‌టేష్.. రానా.. నాని.. నాగార్జున అంటూ ర‌క‌రకాల పేర్లు వినిపించాయి. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. నాని ఇల్లు- కార్యాలయాలపైనా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నాగార్జున ఇల్లు కార్యాల‌యాల‌పైనా ఐటీ దాడులు జ‌రిగాయ‌న్న ప్ర‌చారం వేడెక్కించింది. ఇక వెంకీ పుప్పాల‌గూడ ఇంటికి ఐటీ అధికారులు వెళ్లి సోదాలు చేశారు. చాలా మంది ద‌గ్గ‌ర స‌రైన లెక్క‌లు లేక‌పోవ‌డంతో ప‌త్రాలు- డీవీడీలు – హార్డ్ డిస్కులు స్వాధీన‌ప‌ర్చుకున్నార‌ట‌. ఇక‌ వరుసగా సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తున్న ఐటీ అధికారులు ఆంతర్యం ఏమిటో ఎవరికీ అంతుబట్టడం లేదన్న మాటా వినిపిస్తోంది. ఇలా ఐటీ దాడుల‌తో సినిమావాళ్ల‌ను బెదిరించ‌డ‌మేమిటా అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.