బిగ్ బాస్ పర్మిషన్.. ముమైత్ ఖాన్ బయటకు..?

టాలీవుడ్ డ్రగ్స్ కేసు ప్రస్తుతం ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలుసు. ఇదే టైమ్ లో తెలుగు బుల్లితెరపై కొత్తగా వచ్చిన బిగ్ బాస్ రియాలిటీ షో కూడా బాగానే రచ్చ చేస్తుందని చెప్పాలి. అయితే, ఈ రెండింట్లో కీలకంగా ఉంటూ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఐటమ్ గర్ల్, హాట్ బ్యూటీ ముమైత్ ఖాన్ గురించి ఇప్పుడు చెప్పుకుని తీరాలి. ప్రధానంగా బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళేపాటికి ఇక్కడ టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో ముమైత్ ఖాన్ పేరు బయటకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అదీకాకుండా నోటీసులు అందుకున్న అందరూ విచారణకు హాజరు అవుతుండటం.. ఇప్పుడు ముమైత్ ఖాన్ వంతు వస్తుండటంతో నిన్నటివరకు కొంచెం టెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన వారు బయటకు వచ్చే అవకాశం లేకపోవడం.. బయట నుంచి ఎవరూ లోపలికి వెళ్లే అవకాశం లేకపోవడంతో ముమైత్ ఖాన్ ను ఎలా విచారిస్తారు అంటూ చాలామంది చాలా డౌట్స్ ను తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎట్టకేలకు దీనిపై ఓ క్లారిటీ వచ్చిందని సమాచారం. అదేంటంటే, ఈ నెల 27న విచారణకు హాజరు అవుతానంటూ విచారణాధికారి అకున్ సబర్వాల్ కు ముమైత్ ఖాన్ సమాచారం పంపిందని టాక్ వినిపిస్తుంది.

ఈ మేరకు విచారణకు హాజరయ్యేందుకు బిగ్ బాస్ నుంచి ముమైత్ ఖాన్ కు పర్మిషన్ దొరికిందని అంటున్నారు. దీంతో ఇలా బిగ్ బాస్ ప్రోగ్రాంలో ఎలిమినేట్ అవకముందే స్పెషల్ పర్మిషన్ తో ఒక కంటెస్టెంట్ ఇలా బయటకు రావాల్సి వస్తుందని షో నిర్వాహకులు కూడా ముందుగా ఊహించలేదని చెబుతున్నారు. ఏదిఏమైనా, ఈ డ్రగ్స్ కేసులో ఇలా పూరీ జగన్నాథ్ బ్యాచ్ వాళ్ళకే ఎక్కువగా నోటీసులు జారీ అవడం.. అందరూ విచారణకు హాజరవుతుండటం ఒకెత్తయితే, ఇప్పుడు ముమైత్ ఖాన్ ఇలా స్పెషల్ గా నిలవడం సంథింగ్ స్పెషల్ అనే అనాలి. ఈ ఊహించని పరిణామంతో ముమైత్ కు ఏమైనా కలిసొస్తుందా లేక బిగ్ బాస్ కు కలిసొస్తుందా అనేది వాళ్ళకే తెలియాలి.

Follow US