ప్రభాస్తో సోషియో ఫాంటసీ అంట

తెలుగు పరిశ్రమకి పాన్ ఇండియా స్థాయిని పరిచయం చేసిన కథానాయకుడు ప్రభాస్. ఆయన నటించిన బాహుబలి చిత్రాలు జాతీయ స్థాయిలో విడుదలై సంచనాల్ని నమోదు చేశాయి. అప్పట్నుంచి కథానాయకులు ఆయన బాటలోనే నడుస్తూ, పలు భాషల్లో తమ సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభాస్ మరో అడుగు ముందుకేయబోతున్నాడు. ఆ విషయాన్ని ఆయనతో సినిమా తీస్తున్న దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించారు. ప్రభాస్తో పాన్ వరల్డ్ సినిమాని తీయబోతున్నట్టు ప్రకటించారు. అంటే ఆయన లక్ష్యం మన దేశం మాత్రమే కాదన్నమాట. దీన్నిబట్టి ఆ సినిమా స్కేల్ ఎలాంటిదో ఊహించొచ్చు.

ఈ రోజే ఈ కాంబినేషన్ సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ యేడాది చివరన సినిమా చిత్రీకరణ మొదలవుతుంది. ఈ చిత్రం గురించి నాగ్ అశ్విన్ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. “ప్రభాస్కి థ్యాంక్స్ చెప్పడం తప్ప ఇప్పుడే ఈ సినిమా గురించి ఏమీ మాట్లాడలేను, అయితే అందరూ ఇది పాన్ ఇండియా సినిమా అంటున్నారు. అది తప్పు, పాన్ ఇండియాని ఎప్పుడో కొట్టేశాడు ప్రభాస్. ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నా. 2021 చివర్లో సినిమా విడుదల కావొచ్చు“ అని ట్వీట్ చేశాడు నాగ్ అశ్విన్. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సినిమా సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కబోతోందట.