జ‌న‌వ‌రి 2 నుంచి జాన్ సెట్స్‌కి

Prabhas plays a Tarat Card Reader in Jaan

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా జిల్ రాధాకృష్ణ తెర‌కెక్కించ‌నున్న జాన్ (ప్ర‌భాస్ 20) షూటింగ్ కి ఇటీవ‌ల బ్రేక్ ప‌డిన సంగ‌తి తెలిసిందే. స్నేహితుల‌తో క‌లిసి ప్ర‌భాస్ విదేశాల‌కు వెళ్లడంతో కొత్త సంవత్స‌రంలోనే ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభిస్తార‌ని ప్ర‌చార‌మైంది. ఇదో పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్. తాజా స‌మాచారం ప్ర‌కారం.. జనవరి 2 న‌ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంద‌ట‌.

ఈ చిత్రంలో ప్ర‌భాస్ – పూజా మ‌ధ్య ప్రేమ‌క‌థ హైలైట్ గా ఉండ‌నుంది. ఇందులో పూజా హెగ్డే పాత్ర ఓ స్కూల్ టీచర్ గా న‌టిస్తుండ‌గా ప్ర‌భాస్ యూరోప్ లోని అల్ట్రా రిచ్ బిజినెస్ మేన్ గా క‌నిపించ‌నున్నాడు. ప్ర‌భాస్ – పూజా గెటప్ లు 80ల నాటి ట్రెడిష‌న్ తో ఆక‌ట్టుకోనున్నాయ‌ట‌. జ‌న‌వ‌రి 2 నుంచి భారీ షెడ్యూల్ లో ప్ర‌భాస్ స‌హా కీల‌క తారాగ‌ణం పాల్గొన‌నున్నారు. తెలుగు-త‌మిళం- హిందీ స‌హా ఇత‌ర భాష‌ల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 చివ‌రిలో సినిమా రిలీజ‌వుతుంది.