జాక్ పాపలో చాలా క‌ళ‌లున్నాయి

Last Updated on by

జాక్ ఎవ‌రు అనుకుంటున్నారా..? శ్రీ‌లంక నుంచి ఇండియాకు వ‌చ్చి బాలీవుడ్ లో తిష్ట వేసిన జాక్వ‌లిన్ ఫెర్నాండేజ్. ఈమెను ముద్దుగా జాక్ అని కూడా పిలుస్తుంటారు. ఈమెలో కేవ‌లం న‌టి మాత్ర‌మే కాదు ఇంకా చాలా క‌ళ‌లున్నాయి. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లుగా అన్నీ బ‌య‌టికి తీస్తుంది ఈ భామ‌.Jacqueline Fernandez Multi Talented Sketched A Picture

జాక్వ‌లిన్ ఇప్ప‌టి వ‌ర‌కు న‌టిగా త‌న‌కు తాను గుర్తింపు తెచ్చుకుంది. అందాల ఆర‌బోత‌తోనో.. లేదంటే మ‌రో దానివ‌ల్లో కార‌ణం ఏదైనా జాక్వ‌లిన్ కు బాలీవుడ్ లో బాగానే క్రేజ్ ఉంది. ఓ వైపు న‌టిగా సాగుతూనే.. మ‌రోవైపు జిమ్నాస్టిక్స్ లోనూ దుమ్ము దులిపేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.Jacqueline Fernandez Multi Talented Sketched A Picture

ఇక ఇప్పుడు జాక్వ‌లిన్ త‌న‌లో ఉన్న మ‌రో క‌ళ‌ను కూడా బ‌య‌టికి తీసింది. అదే పెయింటింగ్. ఈ శ్రీ‌లంక‌న్ బ్యూటీలో అద్భుత‌మైన ఆర్టిస్ట్ కూడా ఉంది. న‌ట‌న‌లో ఉండే ఆర్టిస్ట్ కాదు.. మ‌నిషిని చూస్తూ అచ్చంగా అలాగే బొమ్మ వేస్తారుగా ఆ ఆర్టిస్ట్ అన్న‌మాట‌. తాజాగా ఓ వ్య‌క్తి బొమ్మ‌ను సేమ్ టూ సేమ్ వేసి అత‌డికే గిఫ్ట్ ఇచ్చింది జాక్వ‌లిన్. ఇది చూసి అంతా షాక్ అయ్యారు కూడా. ఈ ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. మొత్తానికి జాక్వలిన్ లో తెలియ‌ని క‌ళ‌లు చాలానే ఉన్నాయ‌న్న‌మాట‌.Jacqueline Fernandez Multi Talented Sketched A Picture

User Comments