వైయ‌స్ రాజారెడ్డిగా జ‌గ్గూభాయ్‌

Last Updated on by

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. యాత్ర అనేది టైటిల్. మ‌హి.వి.రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 70ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై విజ‌య్ చిల్లా- శ‌శి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మ‌ల‌యాల మెగాస్టార్ మ‌మ్ముట్టి టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. వైయ‌స్ విజ‌య‌మ్మ, ష‌ర్మిల, జ‌గ‌న్ పాత్ర‌ల‌కు ప‌లువురిని ప‌రిశీలించార‌న్న టాక్ బ‌య‌ట ఉంది.

ఇక‌పోతే ఇందులో జ‌గ‌ప‌తిబాబు వైయ‌స్సార్ తండ్రి రాజా రెడ్డి పాత్ర‌లో న‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఆ మేర‌కు ఇప్ప‌టికే ద‌ర్శ‌క‌నిర్మాత‌లు జ‌గ్గూ భాయ్‌ని సంప్ర‌దించార‌ట‌. ఇటీవ‌లే విల‌న్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జ‌గ‌ప‌తికి బెస్ట్ క్యారెక్ట‌ర్స్‌లో న‌టించే ఛాన్సొచ్చింది. కెరీర్ ప‌రంగా ఎదురే లేని స్థాయికి ఎదిగేశాడు. వైయ‌స్ బ‌యోపిక్‌ని జ‌న‌వ‌రిలో ఎల‌క్ష‌న్ స్టంట్‌ని దృష్టిలో పెట్టుకుని రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నార‌ట‌

User Comments