జ‌ర్నీ జంట ఏం చేస్తున్నారు..?

కొన్ని సినిమాల టైటిల్సే భ‌లే విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు బెలూన్ టీం కూడా ఇదే చేస్తున్నారు. త‌మ సినిమాకు బెలూన్ అనే టైటిల్ పెట్టిన‌పుడే ఆ సినిమాపై ఆస‌క్తి పెరిగిపోయింది. ఇప్పుడు ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది.
త‌మిళ‌నాట బెలూన్ పేరుతో ఓ సినిమా వ‌స్తుంది. జ‌ర్నీ ఫేమ్ జై.. అంజ‌లి జంట‌గా ఈ చిత్రాన్ని శ్రీ‌నిష్ అనే కొత్త కుర్రాడు తెర‌కెక్కిస్తున్నాడు. హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ అతిథిపాత్ర చేస్తున్నాడు. టీజ‌ర్లో మ‌న కుర్రాడు క‌నిపించ‌క‌పోయినా సినిమాలో మాత్రం కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ని తెలుస్తోంది.
ఈ మ‌ధ్య కాలంలో స‌రైన సక్సెస్ లేని జై ఈ చిత్రంపైనే ఆశ‌లు పెట్టుకున్నాడు. కాబోయే భార్య అంజ‌లితో క‌లిసి జై న‌టించిన సినిమా కావ‌డంతో త‌మిళ‌నాట బెలూన్ పై మంచి అంచ‌నాలే ఉన్నాయి. ఇక రాజ్ త‌రుణ్ కూడా బెలూన్ సినిమాతో త‌మిళ్ లో కాస్తో కూస్తో గుర్తింపు వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాడు. పైగా జై.. మ‌రో స్టార్ విజ‌య్ ను ఫాలో అవుతున్నాడు. ఇక ద‌ర్శ‌కుడు శ్రీ‌నిష్.. అట్లీకుమార్ ను ఫాలో అయిపోతున్నాడు. జై చూడ్డానికి కూడా విజ‌య్ మాదిరే క‌నిపిస్తాడు. మొత్తానికి రియ‌ల్ లైఫ్ ప్రేమ‌జంట క‌లిసి న‌టించిన ఈ చిత్రం ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌..!