జై ల‌వ‌కుశ‌.. ఆ ఒక్క‌డు అరాచ‌క‌మే..!

జై ల‌వ‌కుశ‌.. ఇప్పుడు ఎక్క‌డ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. సినిమా గొప్ప‌గా ఏం లేదు. ఇదో మామూలు క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్. కానీ దాన్ని త‌న న‌ట‌న‌తో మ‌రో లెవ‌ల్ కు తీసుకెళ్లాడు ఎన్టీఆర్.
ఈ జ‌న‌రేష‌న్ లో త‌న కంటే గొప్ప న‌టుడు మ‌రొక‌రు లేర‌ని ఎన్టీఆర్ ఈ చిత్రంతో క‌న్ఫ‌ర్మ్ చేసాడు. ఇక పోటీలు లేవు.. ఇన్నాళ్లూ ఆడియ‌న్స్ లోనే ఉన్న మ‌హాన‌టుడు అనే మాట ఇప్పుడు ఇండ‌స్ట్రీలోనూ వినిపిస్తుంది. మ‌రో అనుమానం లేకుండా జై ల‌వ‌కుశ చూసిన త‌ర్వాత ఎన్టీఆర్ ను గొప్ప న‌టుడు అనాల్సిందే.
ఇన్నాళ్లూ ఈయ‌న న‌టించిన సినిమాలు ఒకెత్తు అయితే.. ఇందులో జై పాత్ర పోషించ‌డం మ‌రో ఎత్తు. సినిమా సినిమాకు ఎన్టీఆర్ చూపిస్తోన్న మెచ్యూరిటీ.. క‌థ‌ల ఎంపిక‌లో ఆయ‌న చూపిస్తోన్న నేర్పు.. పాత్ర‌ల ఎంపిక‌లో ఓర్పు చూస్తుంటే ఇప్ప‌ట్లో జూనియ‌ర్ కు ఇక తిరుగులేదేమో అనిపిస్తుంది.
20 ఏళ్లు కూడా లేన‌పుడే ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాసాడు ఎన్టీఆర్. స‌రిగ్గా మీసం కూడా రాని ఏజ్ లోనే స్టార్ అయిపోయాడు ఎన్టీఆర్. కానీ త‌ర్వాత స‌రైన అవ‌గాహ‌న లేక‌.. కెరీర్ లో చిన్న చిన్న త‌ప్పులు కూడా చేసాడు ఎన్టీఆర్. క‌థ‌ల ఎంపిక‌లో పొర‌పాట్లు చేసాడు. వ‌ర‌స ఫ్లాపుల‌తో చాలా త‌క్కువ టైమ్ లోనే హై తో పాటు లోతుల్ని కూడా చూసాన‌ని చెప్పాడు యంగ్ టైగ‌ర్. అలాంటి టైమ్ లో టెంప‌ర్ సినిమా నుంచి మారిపోయాడు ఈ హీరో. అందులో నెగిటివ్ ట‌చ్ ఉన్న పాత్ర చేసిన ఎన్టీఆర్.. నాన్న‌కు ప్రేమ‌తో సినిమాతో త‌న‌లోని న‌టుడికి మ‌రోసారి ప‌నిచెప్పాడు. ఇక జ‌నతా గ్యారేజ్ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ కోరిక తీర్చుకున్నాడు. ఇప్పుడు జై ల‌వ‌కుశ‌తో త‌న‌కంటే తోపు ఎవ‌రూ లేరిక్క‌డ అనే సంకేతాలు పంపించాడు.
సిల్వ‌ర్ స్క్రీన్ పై జైగా ఎన్టీఆర్ న‌ట విశ్వ‌రూపం చూస్తుంటే రోమాలు నిక్క‌బొడుచుకోవ‌డం ఖాయం. అంత‌గా త‌న న‌ట‌నతో ఆక‌ట్టుకున్నాడు ఎన్టీఆర్. ఇక‌పై కూడా త‌న నుంచి వ‌చ్చే సినిమాల‌న్నీ మంచి సినిమాలే అని హామీ ఇస్తున్నాడు జూనియ‌ర్. త్రివిక్ర‌మ్ తో పాటు కొర‌టాల శివ‌, రాజ‌మౌళి కూడా ఎన్టీఆర్ తో సినిమాలు చేయ‌బోతున్నారు. ఇవ‌న్నీ హిట్టైతే ఎన్టీఆర్ రేంజ్ ఊహ‌కు కూడా అంద‌దేమో..?