ఎన్టీఆర్ కొత్త ట్రెండ్.. జై లవ కుశ ఎమోజీలు

 

టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా సినిమాను ప్రమోట్ చేసుకునే విషయంలో ఇప్పుడు స్టార్స్ కొత్త కొత్త ట్రెండ్ లను ఫాలో అవుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా రానా అయితే తన నేనే రాజు నేనే రాజు మంత్రి సినిమా కోసం ఏకంగా ఏఆర్ మోషన్ పోస్టర్ పేరుతో ఓ కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అదే తరహాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన లేటెస్ట్ మూవీ జై లవ కుశ కోసం ఓ లేటెస్ట్ ట్రెండ్ ను దించుతుండటం గమనార్హం. ఇప్పటికే ఆ ట్రెండ్ ను బాలీవుడ్ లో సల్మాన్, కోలీవుడ్ లో విజయ్ వాడేయగా.. టాలీవుడ్ లోకి తొలిసారిగా దానిని ఎన్టీఆరే తీసుకొస్తుండటం విశేషమనే అనాలి.
ఇక అసలు విషయంలోకి వెళితే, ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచం పిచ్చి పీక్స్ కు వెళ్లిన తరుణంలో.. మాటలతో కంటే బొమ్మలతో ఎక్కువగా మాట్లాడుకుంటున్న జనాలు ఎమోజీలను ఎక్కువగా వాడేస్తోన్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు సందర్భం దొరికినప్పుడల్లా ట్విట్టర్, ఫేస్ బుక్ లలో కొత్త కొత్త బొమ్మలతో రకరకాల ఎమోజీలు దిగి అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల సల్మాన్ ఖాన్ తన ట్యూబ్ లైట్ సినిమా రిలీజ్ సందర్బంగా ఏకంగా తన బొమ్మనే ఎమోజీగా రూపొందించి రిలీజ్ చేయించాడు. దీనికి గాను ట్విట్టర్ సంస్థ కొంత భారీ మొత్తమే వసూలు చేస్తుందనే విషయాన్ని మాత్రం ఇప్పుడు మర్చిపోకూడదు.
అయినా సరే రీసెంట్ గా తమిళ స్టార్ హీరో విజయ్ కూడా తన లేటెస్ట్ మూవీ మెర్సల్ కోసం అదే ఫార్ములాను ఫాలో అయిపోయి అలరించాడు. ఇక ఇప్పుడేమో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాళ్ళకంటే రెండాకులు ఎక్కువే చదివి.. తన లేటెస్ట్ జై లవ కుశ లోని మూడు క్యారెక్టర్లనూ మూడు రకాల ఎమోజీలుగా రిలీజ్ చేయిస్తున్నాడట. దీనికోసం ఏకంగా 50 లక్షల రూపాయల వరకు ఖర్చు పెడుతున్నాడని తాజా సమాచారం. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా ప్రియులకు, ముఖ్యంగా ఫ్యాన్స్ కు ఇది  ఫుల్ కిక్ ఇచ్చే న్యూస్ అయింది. ఈ లెక్కన దీని వాడకం ఇప్పుడు సినిమా ప్రమోషన్ ను ఓ మెట్టు పైకెక్కిస్తుందనే చెప్పాలి. అందులోనూ టాలీవుడ్ కు ఇది కొత్త కావడంతో కిక్కే కిక్కు.