పాపం.. ప‌వ‌న్ కు ఎన్ని క‌ష్టాలో..?

Last Updated on by

హాయిగా ఏసి రూముల్లో ఉండేవాడు.. క్యార్ వ్యాన్ లో త‌ప్ప కాలు బ‌య‌ట పెట్ట‌కుండా చూసుకునేవాళ్లు నిర్మాత‌లు.. ఒక్క సినిమా చేస్తే కోట్ల‌కు కోట్లు వ‌ద్ద‌న్నా కూడా వ‌చ్చి ప‌డేవి.. ఇవ‌న్నీ కాద‌నుకుని ఇప్పుడు ప్ర‌జ‌ల కోసం అంటూ ఎండ‌ల్లో మండిపోతున్నాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఈయ‌న క‌ష్టాలు చూసి అయ్యో పాపం అంటున్నారు జ‌నం కూడా. ఈయ‌న‌కు ఇప్పుడు ఇదంతా అవ‌స‌ర‌మా అనుకుంటున్నారు. కానీ ప‌వ‌ర్ స్టార్ మాత్రం త‌న‌కు జ‌నం కంటే ఏదీ ముఖ్యం కాదంటున్నాడు. గ‌డ్డం పెంచేసుకుని.. లూజ్ లాల్చీతో ఎండ‌ల్లో చెప్పుల‌రిగేలా తిరుగుతున్నాడు ప‌వ‌న్. మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు వ‌స్తుండ‌టంతో జ‌న‌సేనను సిద్ధం చేస్తున్నాడు.

Janasena Leader Pawan Kalyan too Much Strugglingప‌నిలో ప‌నిగా త‌న ఓట్ బ్యాంక్ కూడా ఎంతుందో తెలుసుకునే ప‌నిలో ప‌డ్డాడు. అందుకే ఈ పోరాట యాత్ర కూడా. శ్రీ‌కాకుళం నుంచి త‌న పోరాట యాత్ర‌ను మొద‌లుపెట్టిన ప‌వ‌న్.. ఆరు జిల్లాల్లో ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకో నున్నాడు. వాళ్ల క‌ష్టాలు పాయింట్ ఔట్ చేసి.. త‌ర్వాత వాటికి ప‌రిష్కారం చెబుతానంటున్నాడు. త‌న‌కు అధికారం కాదు.. ప్ర‌జ‌ల క్షేమ‌మే ముఖ్యం అంటున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. మ‌రి.. ఈయ‌న ప‌డుతున్న క‌ష్టానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాంటి ఫ‌లితం అందుకోబోతున్నాడో..?

User Comments