జ‌న‌సేనాని వ‌దిన‌మ్మ‌కు సైనికుడైన వేళ‌!

Last Updated on by

మ‌నం ప్రాణంగా భావించే వారిపై మ‌నం కురిపించే ప్రేమ అనిర్వ‌చనీయమైన‌ది. అది చూసేవారికి ముచ్చ‌ట‌గొలుపుతుంటుంది. అదే దైవంగా భావించే వారే మ‌న ప‌క్క‌నుంటే వారి ప‌క్క‌న ఓ సేవ‌కుల‌మై, సైనికుల‌మై త‌రిస్తాం. అలాంటి దృశ్య‌మే ఒక‌టి ఆదివారం సీవీఆర్ సంస్థ‌ల అధినేత ఇంటి వివాహ వేడుక‌లో సాక్షాత్కార‌మైంది. నిత్యం రాజ‌కీయాల‌తో బిజీగా వుండే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ సైనికుడ‌య్యారు. త‌న త‌ల్లి లాంటి వ‌దిన‌మ్మ కోసం ఓ సేవ‌కుడిగా మారిపోయాడు. జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఓ ప‌క్క పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటూనే ఫంక్ష‌న్‌ల‌కు, వెడ్డింగ్‌ల‌కు హాజ‌ర‌వుతున్నారు.

రాజ‌కీయ కార్య‌క్ర‌మాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న జ‌న‌సేనాని ప‌వ‌న్ ఆదివారం హైద‌రాబాద్‌లో ఓ వివాహ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. త‌న త‌ల్లిగా భావించే వ‌దిన‌మ్మ సురేఖ‌తో క‌లిసి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ రావ‌డం ఆక‌ట్టుకుంది. చాలా సంద‌ర్భాల్లో అన్న‌య్య చిరంజీవి, వ‌దిన సురేఖ నాకు త‌ల్లిదండ్రుల‌తో స‌మాన‌మ‌ని చెప్పిన‌ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆ మాట‌ల్ని అనేక సార్లు అక్ష‌రాలా స‌త్యం చేశారు. ఎలాంటి వేడుక జ‌రిగినా అన్నా వ‌దిన‌ల‌ను ఎంత‌గానో గౌర‌వించే ప‌వ‌న్‌ ఆదివారం సీవీఆర్ గ్రూప్ సంస్థ‌ల అధినేత కూతురు వివాహ వేడుక‌లో వ‌దిన సురేఖ‌తో క‌లిసి హాజ‌రు కావ‌డం అక్క‌డున్న వారంద‌రినీ ఆక‌ట్టుకుంది. ప‌వ‌న్‌ని ఓ చిన్న‌ పిల్లాడిలా చేయిప‌ట్టుకుని వేడుక‌కు తీసుకొస్తున్న‌ట్లుగా సురేఖ మ‌రిది ప‌వ‌న్ చేయిప‌ట్టుకుని తీసుకు వ‌చ్చారు. అయితే సెల‌బ్రిటీల ర‌ద్దీ కార‌ణంగా హెవీ క్రౌడ్ వుండ‌టంతో త‌ను వ‌దిన‌కు ర‌క్ష‌కుడిగా మారిన తీరు చూప‌రుల‌కు ముచ్చ‌ట‌గొలిపింది.

User Comments