ప‌వ‌న్‌కి రెండుచోట్లా చేదు అనుభ‌వ‌మే

2019 ఎన్నిక‌లు ప్ర‌పంచానికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పించాయి. సుదీర్ఘ కాలం ఒకే పార్టీ మ‌న‌జాల‌దు! అన్న స‌త్యాన్ని తాజా ఎన్నిక‌లు ఆవిష్క‌రించాయి. అలాగే రాజ‌కీయాలు వేరు.. సినిమా గ్లామ‌ర్ ఛ‌రిష్మా వేరు! అన్న స్ప‌ష్ట‌తను ఇచ్చాయి ఈ ఎన్నిక‌లు. తాజా స‌మాచారం ప్ర‌కారం… జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేసిన రెండు నియోజ‌క వ‌ర్గాల నుంచి ఓట‌మి పాల‌వ్వ‌డం ఆ పార్టీ శ్రేణుల్ని తీవ్ర నిరాశ‌లోకి నెట్టేశాయి.

భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో వైకాపా అభ్య‌ర్థి గ్రంధి శ్రీ‌నివాస్ 3,938 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక గాజువాక‌లోనూ 7000 ఓట్ల తేడాతో ప‌వ‌న్ ఓడార‌ని తెలుస్తోంది. ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్థి నాగిరెడ్డి గెలిచార‌ని తెలుస్తోంది. అయితే జ‌న‌సేనానిగా ప‌వ‌న్ త‌న ప్ర‌య‌త్నం తాను చేశారు. ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. స‌మ‌స్య‌ల్ని అడిగి తెలుసుకున్నారు. నిజాయితీగా శ్ర‌మించారు. బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల్ని క‌లుపుకుని రాజ‌కీయాల్లో కొన‌సాగుతాన‌న్న మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నారు. అలాగే ఎన్నిక‌ల్లో డ‌బ్బు జ‌ల్లే పార్టీల‌కు అతీతంగా వెళ‌తాన‌ని అన్నారు. ఏ కోణంలో చూసినా ప్ర‌త్య‌ర్థులు చేసిన ప్ర‌చారం నెగ్గింది. “ప‌వ‌న్ ఎన్ని చెప్పినా తెలుగు దేశం పార్టీకి అనుకూలం“ అన్న ప్ర‌చారం పెద్ద దెబ్బ కొట్టింది. తేదేపా వ్య‌తిరేక ఓటు అంతా వైకాపాకు గంప‌గుత్త‌గా ప‌డిపోవ‌డం .. దాంట్లోనే జ‌న‌సేన కొట్టుకుపోవ‌డం జ‌రిగింద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది.

Also Read : Pawan Promised People On His Failure!