జ‌న‌సేనాని ఇంకా సందిగ్ధంలోనే!

Last Updated on by

కుప్పంలో తేదేపా అధినాయ‌కుడు నారా చంద్ర‌బాబు నాయుడు .. పులివెందుల‌లో వైకాపా అధినేత‌ వైయ‌స్ జ‌గ‌న్ అత్య‌ధిక మెజారిటీతో గెలుపొందారు. అయితే గాజువాక‌.. భీమ‌వ‌రంలో పోటీకి దిగిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌న్నివేశ‌మేంటి? అంటే గెలుపు దోబూచులాడ‌డం ఏపీ ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కొచ్చింది.

ఇక ఇలాంటి స‌న్నివేశంలో తూ.గో జిల్లా రాజోలులో జ‌న‌సేన అభ్య‌ర్థి రాపాక వ‌ర‌ప్ర‌సాద్ గెలుపొందారు. ఈ విజ‌యంతో జ‌న‌సైనికులు సంబ‌రాలు జ‌రుపుకుంటున్నారు. అయితే అధినాయ‌కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ భీమ‌వ‌రం.. గాజువాక‌లో వెన‌కంజ‌లో ఉండ‌డం పార్టీ వ‌ర్గాల్లో తీవ్ర నిరాశ‌ను క‌లిగించింది. స్ప‌ష్ట‌మైన మెజారిటీతో ప‌వ‌న్ పోటీనివ్వ‌లేక‌పోవ‌డం పై ర‌క‌ర‌కాలుగా అభిమానులు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నారు. అయితే ఓట‌ర్ మాత్రం చాలా స్ప‌ష్టంగా ఏపీలో వైకాపాకు, కేంద్రంలో ఎన్డీయే-భాజ‌పాకు ప‌ట్టంగ‌ట్ట‌డం క‌ళ్ల‌కు క‌నిపిస్తోంది.

Also Read : Pawan Promised On His Failure!

 

User Comments